Loading...

15, జూన్ 2014, ఆదివారం

మది కోరుతుంది...

           మబ్బులరేడు చినుకుల చేతులతో భూదేవి బుగ్గలకు గంధం వ్రాస్తున్నాడా అన్నట్టు మట్టి సువాసనలు చుట్టుముట్టినాయి.
         అవనీ లలామ చెలుని ముచ్చట పలుకుల గుసగుసలన్నట్టుగా పైనుండి రాలు చినుకుల చిటపటసవ్వడులు చెవులఁ జేరుతున్నాయి.
         కచేరికి ఆలస్యమైతుందేమోనన్నట్టు వీణావాదన మధురిమలు ఎక్కడ కోలుపోతుందో బిడ్డ అన్నట్టు పాదాలు మనసు నెత్తుకొని అడుగులు వేస్తున్నాయి.
         మనోౕజ్ఞమైన దృశ్యము చూచిన వెంటనే వెన్వెంటనే రసజ్ఞులతో పంచుకోమని చేతివేళ్ళను మది కోరుతుంది.