Loading...

19, జనవరి 2013, శనివారం

కృష్ణసుధాలహరిలో......


         మధురనాద భరితమై , సుందరశబ్దశోభితమై , భావనాగరిమ పూరితమైన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచనా సాగరంలో మునిగితేలని భావుక హృదయములేవి? సౌరభములేల విరజిమ్ము పుష్పవ్రజము అన్నట్టు తీయని తేనెలొలికే తేటతెలుగు కవిలోకంలోగాక ఇంకెక్కడ అవతరించు మన కృష్ణశాస్త్రి ?

       అదీ రేడియో లో చిత్ర గీతాలు వినే రోజుల్లో అత్యంత మధురమైన పాట వినగానే ఆ గుబాళింపు ఏ మల్లికలదో తెలిసిపోయినట్టు, కృష్ణశాస్త్రిగాక ఇంకెవరు వ్రాసి ఉంటారీ పాట అనుకునేదాన్ని. వారి పుస్తకాలు చదవకముందే , వారిగురించి తెలియక ముందే ఆ గీతాలు మైమరపించి మరీ వారిమీద మరువని మాయని అభిమానాన్ని ఏర్పరిచాయి. వాటిల్లో కొన్ని పాటలు ముందుగా వేరే రచనల్లో వ్రాసినవి కూడా ఆయా చిత్రాలకు స్వీకరించడం జరిగిందని తర్వాతే తెలిసింది.

          ఈ మధ్యే చదివిన బ్రౌన్ అకాడమీ వారి తెలుగుజాతి రత్నాలు అనే శీర్షిక క్రింద ప్రచురించిన దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి అనే పుస్తకంలోని కొన్ని అజరామరమైన చిత్రగీతాలు ఇక్కడ భద్రపరుస్తున్నాను. నేను వినని పాత పాటలను విడిచిపెట్టి విన్నవి, ఇష్టమైనవీ మాత్రమే ఉంచుతున్నాను.

భక్తతుకారాం చిత్రంలోని ఘనాఘన సుందరా! కరుణారసమందిరా! అది పిలుపో మేలుకొలుపో మధురమధురమౌ ఓంకారమో పాండురంగ పాండురంగ
ప్రాభాత మంగళపూజావేళ
నీ పద సన్నిధి నిలబడి... నీ పదపీఠిక తలనిడి
ప్రాభాత మంగళపూజావేళ
నీ పద సన్నిధి నిలబడి... నీ పదపీఠిక తలనిడి
నిఖిల జగతి నివాళులిడదా... నిఖిల జగతి నివాళులిడదా
వేడదా... కొనియాడదా... పాండురంగ... పాండురంగ...
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
గిరులూ ఝరులూ విరులూ తరులూ...
నిరతము నీ పాద ధ్యానమే... నిరతము నీ నామ గానమే
గిరులూ ఝరులూ విరులూ తరులూ
నిరతము నీ పాద ధ్యానమే... నిరతము నీ నామ గానమే
సకల చరాచర లోకేశ్వరేశ్వరా... సకల చరాచర లోకేశ్వరేశ్వరా
శ్రీకరా... భవహరా...పాండురంగ... పాండురంగ...
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా

ఈనాటి ఈ బంధమేనాటిదో చిత్రంలోని
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకూ పూలిమ్మని రెమ్మరెమ్మకూ
ఎంత తొందరలే హరిపూజకూ పొద్దు పొడవక మున్నె పూలిమ్మని
కొలువైతివా దేవి నాకోసము తులసి తులసి దయాపూర్ణ కలశి
మల్లెలివి నాతల్లి వరలక్ష్మికి మొల్లలివె నన్నేలు నా స్వామికి
ఏలీల సేవింతు ఏమనుచు కీర్తింతు సీత మనసే నీకు సింహాసనం
ఒక పువ్వు పాదాల ఒక దివ్వె నీ మ్రోల ఒదిగి నీ యెదుట ఇదె వందనం ఇదెవందనం

ఆనందభైరవి చిత్రంలోని
కొలువైతివా రంగశాయి కొలువైన నిను చూడ కలవా కన్నులు వేయి హాయి కొలువైతివా రంగశాయి

సీతామాలక్ష్మి చిత్రంలోని
మావి చిగురు తినగానే కోయిల కూసేనా కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
ఏమో ఏమగునో గానీ ఆమని ఈవని...
తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా
తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా
తారాటలా సయ్యాటలా
సయ్యాటలా తారాటలా
వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు?
బింకాలు... బిడియాలు....పొంకాలు...పోడుములు
ఏమో ఎవ్వరిదో గానీ ఈ విరి?గడసరి?
ఒకరి వళ్ళు ఉయ్యాల వేరొకరి గుండె జంపాల
ఉయ్యాల....జంపాల...జంపాల....ఉయ్యాల
ఒకరి వళ్ళు ఉయ్యాల వేరొకరి గుండె జంపాల
ఒకరి పెదవి పగడాలో..వేరొకరి కనుల దివిటీలో..
ఒకరి పెదవి పగడాలో..వేరొకరి కనుల దివిటీలో..
పలకరింతలో...పులకరింతలో
పలకరింతలో...పులకరింతలో
ఏమో ఏమగునోగానీ ఈ కథ.....మనకథ...

మేఘసందేశం చిత్రంలోని
ఆకులో ఆకునై పూవులో పూవునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
గలగలని వీచు చిరుగాలిలో కెరటమై
జలజలని పారు సెలపాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు తేటినై
పరువంపు విరిచేడె చిన్నారి సిగ్గునై
ఈ అడవి...
తరులెక్కి ఎలనీలి గిరులెక్కి మెలమెల్ల
చగలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ .....వెఱ్ఱినై ఏకతమ తిరుగాడ
ఈ అడవి.....

ఉండమ్మా బొట్టు పెడతా చిత్రంలోని
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
నీ కోవెల యీ యిల్లు కొలువై ఉందువుగాని కొలువై ఉందువు గాని కలుముల రాణీ
గురివింద పొదకింద గొరవంక పలికె గోరింటకొమ్మల్లో కోయిల్లు పలికె
తెల్లారిపోయింది పల్లెలేచింది పల్లియలో ప్రతియిల్లు కళ్ళు తెరిచింది
కడివెడు నీళ్ళు కళ్ళాపి జల్లి గొబ్బిళ్ళోగొబ్బిళ్ళు
కావెడు పసుపు గడపకు పూసిగొబ్బిళ్ళోగొబ్బిళ్ళు
ముత్యాలముగ్గుల్లో ముగ్గుల్లోగొబ్బిళ్ళోగొబ్బిళ్ళు
రతనాలముగ్గుల్లోముగ్గుల్లోగొబ్బిళ్ళోగొబ్బిళ్ళు
పాడిచ్చే గోవులకు పసుపుకుంకం పనిచేసే బసవనికి పత్రీ పుష్పం
గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం
కష్టించే కాపులకు కలకాలం సౌఖ్యం కలకాలం సౌఖ్యం

రాజమకుటం చిత్రంలోని
సడి సేయకో గాలి సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవ్వళించేనే
రత్నపీఠికలేని రారాజు నా స్వామి
మణికిరీటము లేని మహరాజు గాకేమిచిలిపి పరుగుల మాని కొలిచి పోరీదేసడిసేయకే
ఏటిగలగలలకే ఎగసి లేచేనే ఆకు కదలికలకే అదరి చూసేనే నిదురచెదిరిందంటే నేనూరుకోనే సడిసేయకే
పండువెన్నెలనడిగి పాన్పు తేరాదే నీలిమబ్బులనడిగి నిదుర తేరాదే విరులవీవనబూని విసిరి పోరాదే సడిసేయకే

గోరింటాకు చిత్రంలోని
గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగిందీ
మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడుగన్నేరు లా పూస్తే కలవాడొస్తాడు
సింధూరంలా పూస్తే చిట్టిచేయంత అందాల చందమామ అతడే దిగి వస్తాడు
పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్ళు కోపిష్టికళ్ళు
పాపిష్టి కళ్ళల్లో పచ్చకామెర్లు కోపిష్టి కళ్ళల్లో కొరివిమంటల్లు

అమెరికా అమ్మాయి చిత్రంలోని
పాడనా తెనుగు పాట పరవశనై మీ ఎదుట మీ పాట
కోవెల గంటల గణగణ లో, గోదావరి తరగల గలగల లో
మావుల తోపుల మూపుల పైన మసలే గాలుల గుస గుసలో
మంచి ముత్యాల పేట మధురామృతాల తేట ఒక పాట

త్యాగయ క్షేత్రయ రామదాసులు, తనివితీర వినిపించినది
నాడునాడులా కదిలించేది వాడవాడలా కరిగించేది
చక్కెర మాటల మూట చిక్కని తేనెల ఊట ఒక పాట

ఒళ్ళంత వయ్యారి కోక, కళ్ళకు కాటుక రేఖ..
మెళ్ళో తాళి కాళ్ళకు పారణి మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు అల్లనల్లన నడయాడే
తెనుగు తల్లి పెట్టని కోట తెనుగు నాట ప్రతి చోట ఒక పాట  పాడనా తెనుగు పాట

రాక్షసుడు చిత్రంలో తీసుకున్న
జయజయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి
జయజయ జయ శతసహస్ర నరనారీ హృదయనేత్రి
జయజయ సశ్యామల సుశ్యామ చలచ్చేలాంచల
జయ వసంత కుసుమలత చలితలలిత చూర్ణకుంతల
జయమదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా
జయదిశాంత గతశకుంత దివ్యగాన పరితోషణ
జయగాయక వైతాళిక గళవిశాల పథవిహరణ
జయమదీయ మధుర గేయ చుంబిత సుందరచరణా
జయజయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి


అమృతధారలు కురిపించి తెలుగు భావకవిత్వానికి చిరాయువు ను ప్రసాదించిన శ్రీ దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి గారికి శతసహస్రవందనములివే.

13, జనవరి 2013, ఆదివారం

నా ముగ్గులు......మా ముంగిట్లో..

కలహంసల ముగ్గు
టెంకాయల ముగ్గు