Loading...

19, జూన్ 2012, మంగళవారం

జలవారధి (నీటివంతెన)చలిగాలుల సందేశాన్ని పంపి తన రాకను
తెలుపుతున్న వారెవ్వరే సఖీ!

అలనాడొక రాతివంతెన నీటిపై కట్టినట్టుగా.....
కలకంటున్న భువనానికి గగనసీమలనుంచీ
ఇలఁ జేరువరకూ  జలవారధి గాలిలో కట్టేవారెవ్వరే సఖీ!
ఋతురాగము ననురాగముగా ఆలపిస్తున్న దెవ్వరే సఖీ!

తొలి చినుకుల చూపులతో భూదేవిని
పులకింపఁజేస్తున్నదెవ్వరే సఖీ!

పలువన్నెలతో సింగారపు బొమ్మవలె
ఫలపుష్పాదులతో , పచ్చదనాలతో
అలంకరిస్తున్నదెవ్వరే సఖీ!