Loading...

8, ఫిబ్రవరి 2012, బుధవారం

విశాఖపట్టణం లో అష్టావధానం !!



ఇంకొక అష్టావధానం గురించిన వివరాలివిగో:
ఆసక్తి, అనుకూలం ఉన్న భాషాప్రియులకు విందులివే.

అష్టావధానం

12-02-2012 (ఆదివారం) నాడు

విశాఖపట్టణం
లలితానగరం (అక్కయ్యపాలెం) లోని
శ్రీ లలితాపీఠంలో
సాయంకాలం 6 గంటల నుండిఅవధాని శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారిఅష్టావధానం

ఆసక్తి ఉన్న సాహితీప్రియులకు ఇదే ఆహ్వానం!

5, ఫిబ్రవరి 2012, ఆదివారం

హైదరాబాద్ లో అష్టావధానము(పోస్ట్ అప్డేటెడ్)


సాహితీ ప్రియులారా! 
12వ తేదీన ఆదివారం  
మియాపూర్, జయప్రకాశ్ నారాయణ్ నగర్, హైదరాబాద్ లో 
శ్రీ వేంకటేశ్వరస్వామివారి కోవెల ప్రాంగణంలో 
మధ్యాహ్మం 3 గంటలకు జరుగబోవుచున్నది.
శ్రీ కట్టమూరి చంద్రశేఖర అవధానిగారి 
అష్టావధానము
రసజ్ఞులు జయప్రదం చేయగలరని ఆశిస్తూ........
వివరాలకు..

అష్టావధానం గురించి ఆంధ్రామృతం బ్లాగ్ నడిపే శ్రీయుతులు చింతా రామకృష్ణారావు గారి మాటల్లోనే........

జైశ్రీరామ్.
అవధానం అనేది తెలుగు సాహిత్యం లో ఒక విశిష్ట ప్రక్రియ సంస్కృతము, తెలుగు కాకుండా వేరే ఏ యితర భాషలోనుఈ ప్రక్రియ ఉన్నట్లు కనపడదు. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు చెప్పుతూ అవధాని సభాసదులనలరింప జేయడం అన్నది అవధాని ప్రత్యేకత.వీటన్నిటినీ ఏక కాలంలో అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానం.
ఈ అవధానాలు పలు రకములు.
వేదసంబంధ అవధానాలు: 
సాహిత్య అవధానాలు: (అష్టావధానం, శతావధానం, సహస్రావధానం... ఇలా 20దాకా ఉన్నాయి)
సాహిత్యేతర అవధానాలు: (శతకలశావధానం, శభ్దావధానం, రామాయణ, భగవద్గీత అవధానాలు. ఇవి ధారణ సంబంధమైనవి. అంటే ఒక్కసారి చదివి లేదా విని గుర్తుంచుకోవడం ద్వారా మళ్లీ చెప్పేవి)
సాంకేతిక అవధానాలు:
శాస్త్ర సంబంధ అవధానాలు: 
కళా సంబంధ అవధానాలు:
ఇలా అనేకమైన అవధానాలు ప్రాచుర్యం పొంది ఉన్నాయి.
అందు సాహిత్యావధానాలు బహుళ ప్రచారంలో ఉన్నాయి.
అసలు అవధానం అంటే ఏమిటి? అనే ప్రశ్న మనకు వస్తుంది. 
అవధానము = ఎచ్చరిక. మనో యోగము.ఆంగ్లములో ఎటెంక్షన్. కేర్.డివోషన్. రిగార్డ్. ఇంటెంట్నెస్.ఎటెంటీవ్నెస్. అనే అర్థాలున్నాయి. 
అవధాని ప్రారంభము నుండీ పృచ్ఛకులు వేసే ప్రశ్నలను మనసులో ఉంచుకొని, ఒక్కొక్కరి ప్రశ్నకు సమాధానము ఒక్కొక్క ఆవృత్తికి ఒక్కొక్కపాదము వరిసగా ఒకరి తరువాత ఒకరికి చెప్పుతూ, నాలుగు ఆవృత్తులలో పూరించాలి.
పూరణ పూర్తి అయిన తరువాత ధారణ.
అంటే తాను మొదటి నుండీ వరుసగా ఏ యే పృచ్ఛకునకు ఏయే సమాధానం చెప్పారో ఏ పద్యం చెప్పారో అదే పద్యాన్ని నాలుగు పాదాలు కలిపి చెప్పాలి. అలాగ ఆ అందరు పృచ్ఛకులకు చెప్పాలి. ఈ ప్రక్రియను అవాధానం అంటాము.
సాహిత్య అవధానాలలో అష్ట, ద్విగుణీకృతాష్ట, త్రిగుణీకృతాష్ట, శత, ద్విశత, త్రిశత, సహస్ర, ద్విసహస్రాదికమగు అవధానములు సామర్ధ్యంతో నేటి అవధానులు చేస్తున్నాను.
అందు మనకు వెశేషాదరణను పొందుతున్నది అష్టావధానము.
అష్టావధానములో స్వీకరిస్తున్న అంశాలు ఎనిమిది. 
ఆ యెనిమిదీ అవధాని, పృచ్ఛకులు కలిసి నిర్ణయించుకొని నిర్వహిస్తుంటారు.
అవి
సమస్యాపూరణం, దత్తపది, వర్ణన, ఆశువు, నిషిద్ధాక్షరి, అప్రస్తుత ప్రసంగం, వివర్గాక్షరి, నిర్దిష్టాక్షరి, ఘంటా గణనం, పురాణ పఠనం, సహ పఠనం, కావ్యోక్తి, ఇచ్ఛాంక శ్లోకము, ఛందో భాషణము, అడిగిన ఆంగ్ల తేదీకి వార ప్రకటన్, మొదలగు వాటిలో ఎనిమిది ప్రక్రియలు ఎన్నుకుంటారు.
"ధారణ" తో అవధానం ముగుస్తుంది.  
ఈ అవధానం వలన ప్రయోజనమేమిటి?
అనే సందేహం మనకి రావచ్చును.
అవధానాన్ని మనం చూచినట్లైతే అవధాని ఏక కాలంలో  ఎనిమిదిమంది పృచ్ఛకులడిగిన ప్రశ్నలకు ఒక్కొక్క ఆవృత్తిలో ఒక్కొక్క పాదం ఎవరిది వారికి చెప్పుతూ నాలుగు ఆవృత్తులూ పూర్తయిన తరువాత వరుసగా పృచ్ఛకులందరికి మొత్తం ఎవరి  పద్యం వారికి చెప్పడం జరుగుతుంది. ఈ ప్రక్రియ మెదడును  లొంగదీసుకొని, జ్ఞాపక శక్తిని మెదడుకు పెంచుకొంటూ  సద్యస్ఫూర్తిని పొందుతూ, పృచ్ఛకులడిగే అసందర్భమైన ప్రశ్నలకు కూడా చమత్కారతో సమాధానం చెప్పుతూ, అందరి మనసులనూ ఆకట్టుకోగలగడం అవధాని యొక్క సాధన వలననే సాధ్యమైనదని మనం గ్రహించ గలం.
అంటే మనమూ సాధన చేస్తే మనసుచేత ఎంతటి క్లిష్టమైన పనినైనా చేయించ వచ్చునని, మనసును మా స్వాధీనంలో ఉంచుకోవచ్చునని, జ్ఞాపక శక్తిని అపారంగా పెంచుకో వచ్చునని,మరపు అన్నదానినే మనం పూర్తిగా మరచిపోవచ్చునని, గ్రహించ గలం. ఇది విద్యా విషయంలో సాధన చేయ గలిగితే విద్యార్థులకు అమోఘమైన ఫలితాన్నిస్తుంది. పరీక్షా సమయాల్లో మరచిపోవడం అన్న మాటే ఉండదు. అందుకే ఆబాల గోపాలము తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా వెళ్ళి, ఆకార్యక్రమం ఆద్యంతం చూచి, స్ఫూర్తిని పొందాలి. తమ మేధాశక్తిని పెంచుకోవాలి.
ఇంతటి ప్రయోజనం కలుగ జేస్తున్న ఈ అవధాన ప్రక్రియ పూర్తిగా ఆంధ్రులమైన మన సొంతం. 
ఐతే ఇప్పుడు మనమేంచెయ్యాలి?
మనము, పిల్లలు, మిత్రులు అందరితో కలిసిఇటువంటి కార్యక్రమానికి వెళ్ళాలి.
అదెప్పుడు? ఎక్కడ? 
అంటే
హైదరాబాదు, మియాపూర్, జయప్రకాశ్ నారాయణ్ నగర్, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కోవెల ప్రాంగణంలో
మధ్యాహ్నం 3 గంటల నుండి
డా.కట్టమూరి చంద్రశేఖరావధాని గారిచే జరుప బడుతుంది.