Loading...

3, అక్టోబర్ 2011, సోమవారం

మెరుపులు, ఉరుములు

మనసు లోతుల్లోని అట్టడుగు పొరల్లో
మాయని మమతల జ్ఞాపకాలు

ఉన్నట్టుండి నీలాకాశంలో మెరుపులలో
కనిపిస్తున్నాయి, మురిపిస్తున్నాయి.

తవ్వి తీయకనే.., కోరకనే.........
మెరుపులు మురిపిస్తాయి, ముచ్చట గొల్పుతూ..


ఉరుములు  ధ్వనులే.....జడిపిస్తాయి.
మెలకువనీ, వాస్తవాన్నీ గుర్తు చేస్తూ ...

మెరుపులు, ఉరుములు  విడిపోవేమో.
శివశక్తుల్లా, వెలుగునీడల్లా.
               --------లక్ష్మీదేవి