నల్లనీ సందురూడు నామామ
సల్లనీ సూపులోడు నామామ!
మల్లెవంటి మనసున్న నామామ
అల్లదిగో వస్తన్నడునామామ!!
కల్లకపటమెఱుగనోడునామామ
మల్లమల్ల ముఱిపించు నామనసును
బుల్లిబుల్లి పిల్లలంటె ముచ్చటాడికి
మల్లిమల్లి ఆటలాడు ఆళ్ళతోడనె!
తెల్లనోడు నింగిలోన చందమామ
సల్లనోడు ముంగిల్లోన నామామ
వెళ్ళవోయి జాబిల్లి నిన్ను నమ్మను
వొల్ల నేనింకొకరిని ఈ జన్మకు!
---లక్ష్మీదేవి
సల్లనీ సూపులోడు నామామ!
మల్లెవంటి మనసున్న నామామ
అల్లదిగో వస్తన్నడునామామ!!
కల్లకపటమెఱుగనోడునామామ
మల్లమల్ల ముఱిపించు నామనసును
బుల్లిబుల్లి పిల్లలంటె ముచ్చటాడికి
మల్లిమల్లి ఆటలాడు ఆళ్ళతోడనె!
తెల్లనోడు నింగిలోన చందమామ
సల్లనోడు ముంగిల్లోన నామామ
వెళ్ళవోయి జాబిల్లి నిన్ను నమ్మను
వొల్ల నేనింకొకరిని ఈ జన్మకు!
---లక్ష్మీదేవి