Loading...

14, జనవరి 2011, శుక్రవారం

మా మంచి సూరీడు

ముగ్గుల్ల ముంగిళ్ళ
గొబ్బిళ్ళ రంగుల్ల
పువ్వుల్ల నవ్వుల
గుమ్మడి ఘుమఘుమల
పులగాల రుచులెల్ల
చవి చూచి నేడు
కొత్తింటి కెళ్ళాడు
మా మంచి సూరీడు
గోవుల్లు వర్ధిల్ల
పసిడి పండంగ
దీవించ రావయ్య
సంక్రాంతి వేళల్ల !!
--మందాకిని


అందరకీ సంక్రాంతి శుభాకాంక్షలు!

12, జనవరి 2011, బుధవారం

నమస్కారములు!

వివేకానందుని సాహిత్యము కొంతవరకూ నేనూ చదివాను.
ఈవేళ వారి జయంతి. నేను చదివినంతలో , నా బుఱ్ఱకు ఎక్కినంతలో కొన్ని విషయాలు గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తాను.
* ప్రపంచంలోని వారందరినీ మన వారనే భావంతో చూడాలి. ( అణగద్రొక్కే వారిని అణగద్రొక్కబడిన సమయంలో తప్ప)
* ఎవరూ ఒకరికి ఒకరు తక్కువ కాదు. ఒకరితో మనం నేర్చుకునేదీ ఉంటుంది. నేర్పాల్సిందీ ఉంటుంది.
( తూర్పు, పశ్చిమ నాగరికతలకు కూడా ఇది వర్తిస్తుంది.)
* ఎంతో గొప్పదైన మన చరిత్ర మనం మన చరిత్ర పాఠ్య పుస్తకాలలో మనం పూర్తిగా తెలుసుకోకపోవటం వల్ల మనం ఆత్మన్యూనతా భావాన్ని పెంచుకున్నాం. ( వివేకానందుని పలుకులలో మన పూర్వీకుల ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని నేను తెలుసుకున్నా.)
* విద్యాభ్యాసం ఎంత ముఖ్యమో శారీరక దార్ఢ్యం అంతే ముఖ్యం.
వారికి నా నమస్కారములు శ్రద్ధతో సమర్పిస్తున్నాను.
ఈవేళ నాకన్నా ముందుగా వారిని తలచుకున్న నా మిత్రబ్లాగర్లందరికీ ఈ పుణ్యదినాన శుభాకాంక్షలు.

10, జనవరి 2011, సోమవారం

మధుర స్వప్నం

ఈ పాట విందామా!

ఎన్నో
ఊహలు ఎన్నో తలపులు ఎన్నో ఆశలు .......