Loading...

17, ఫిబ్రవరి 2018, శనివారం

సింధుభైరవి - క్రేజీ హార్ట్

 క్రేజీ హార్ట్ (2009) చిత్రం గురించి ఒక పరిచయం 
ఎక్కడో చదవగా సింధుభైరవి (1985) చిత్రం గుర్తొచ్చింది.
ఆసక్తి కలిగి చూశాను. వారి సమాజపు నేటివిటీకి తగిన సినిమాలు
 చూడడం కొంచెం కష్టమే. అయినా మొత్తంగా 
బాగుందని చెప్పవచ్చు. 
  సింధుభైరవిలోనూ, క్రేజీ హార్ట్ లోనూ నచ్చిన అభిరుచీ/సంగీతమూ
తానూ తప్ప 
మిగతా లౌకికవిషయాలకు ఎక్కడ ఏ ప్రాధాన్యత 
ఇవ్వాలో తెలిసి నడచుకోలేని అనేకానేక భావుక హృదయాలకు 
చెందినదే ఈ కథానాయక హృదయమూ. తన
ప్రాణప్రదమైన అభిరుచులతో మాత్రమే ఆనందాకాశాల, 
సంతోష సాగరాల అంచులను చూసే స్థితి ఆ భావుక
హృదయాలకు అనుభవైకవేద్యము. చెప్పి తెలిసేది కాదు.
   కానీ ఒక్కసారి ఒక చివరిదశలో లేదా ఏదో శూన్యావస్థలో 
కోల్పోయిన విషయాలు తెలుస్తాయి. ఆనందానికి
 చెల్లించిన  మూల్యమూ తెలుస్తుంది. 
 
we have to pay for every thing
 ఈ అర్థం వచ్చే పంక్తులూ
 ఉన్నాయి ఆ సినిమా పాటల్లో . 
 
క్రేజీ హార్డ్ లో చాలా పాటలు నచ్చాయి. వాటి సాహిత్యమూ , 
సంగీతమూ కూడా. కొన్ని పంక్తులు మరీ నచ్చాయి.
 
I've been loved and I've been alone 
All my life I been a rolling stone
 
 It's funny how fallin' feels like flyin'
 For a little while
 
And this ain't no place for the weary kind
 
పాటలను ఇక్కడ వినవచ్చు, చదవచ్చు . 
https://www.stlyrics.com/c/crazyheart.html  

మొత్తం చూసిన తర్వాత కూడా రెండింటిలో ముఖ్యంగా 
ఇదే కథా వస్తువు  అనే అభిప్రాయం మారలేదు.
వారి నేటివిటీకి తగినట్టు ఈ వస్తువును మలిచారంతే. 
ఏ తెలుగు చిత్రమైనా ఏ విదేశీభాషలోంచి కాపీ కొట్టారో 
మాకు తెలుసంటే మాకు తెలుసంటూ పోటీ పడే ఇక్కడి
ప్రేక్షకులు క్రేజీ హార్ట్ ను సింధుభైరవి నుంచి కాపీ కొట్టారనరు. 
నేను మాత్రం అలాగే అంటున్నాను. క్రేజీ హార్ట్ 
ముఖ్యమైన కథావస్తువు సింధుభైరవి అనే చిత్రం లోనిదే. 
వాళ్ళకు ఈ చిత్రం ఎక్కడ దొరుకుతుంది, వాళ్ళెందుకు
ఈ తమిళ/తెలుగు సినిమా చూసిఉంటారు, ఇద్దరు దర్శకులకు 
ఒకే ఆలోచన రాదా అనే మాటలు చెల్లవు. 
ఎందుకంటే ఒకచోట చెల్లితే ప్రతిచోటా ఇవే మాటలు చెల్లాలి మరి. 😏
క్రేజీ హార్ట్ అదే పేరుతో ఉన్న నవల ను చిత్రంగా మలచినదే. 
ఆ నవల గురించే నేనంటున్నానుకోవచ్చు. 
 
    కాకపోతే పాటలు మాత్రం ఆ కథా వస్తువుకు 
బాగా సరిపోయేటట్లుగా వ్రాశారు. తర్వాత ఆహ్లాదకరమైన ప్రకృతి
దృశ్యాలు కూడా ఉన్నాయి. పాటలు, ప్రకృతి దృశ్యాలూ బాగా ఆకట్టుకుంటాయి. 
 
గమనిక-కేవలం కాపీ అని చెప్పాలని పోస్ట్ పెట్టడం లేదు.
తెలిసిన వారు ఈ పోలిక గురించి ఏం చెప్తారో విని తెలుసుకుందామనే.

ఎంతయొ యంచు నెంచితిని..

సమస్యాపూరణము --


"ఇంత సుకోమలమ్ముగ, ప్రహేళిక రీతిని భావవల్లరుల్
వింతగు కొత్త పోలికల, వేడుక- వేదన యొప్పురీతిగా
నింతిరొ! పల్కుచుండ గని, హృద్య విలాసము గల్గుదానవీ
వెంతయొ యంచు నెంచితిని, యింతియయే?" యని మీర లెంతురే !


చివరి పాదము సమస్యగా నివ్వబడినది. (విలాసము=సౌందర్యము)
----లక్ష్మీదేవి.

16, ఫిబ్రవరి 2018, శుక్రవారం

రెండు తరాలు

       రెండు తరాలు కలిసి ఉన్నప్పుడు నాడు నేడని కాక ఏ తరంలోనైనా ఏవో ఇబ్బందులు, అపార్థాలు ఉంటుంటాయి. కానీ కలిసి ఉండడం జీవితం అన్నప్పుడు దాన్ని వాయిదాలు వేయకపోవడమే మంచిది. చాలా రోజుల తర్వాత  ఈరోజు కల్సిన స్నేహితురాలు ఎంతో సంతోషంతో ఎన్నో విషయాలు మాట్లాడుతూ త్వరలో కొడుకు కోడలు కొత్తగా కొన్న ఇంట్లోకి వెళ్ళబోతున్నట్టూ తాము వెళ్ళాలా వద్దా అనే సందిగ్ధత తెమలనట్టూ చెప్తూ, సలహా అడిగింది.

      నాకు ఈ దశకు చేరుకోవడానికి కొద్ది కాలము ఇంకా ఉంది కానీ,  ఇప్పటికి నాకు తెలిసినంత చెప్పాను. ఎప్పటికైనా కలిసే ఉండవలసిన రెండు తరాలు మొదట్నించే కలిసే ఉండడం మంచిదనీ, అప్పుడే ఇబ్బందులూ, కలతలూ ఉన్నా సర్దుకోవడమో, అలవాటవడమో అవుతుందనీ, కలిసి ఉండడం అనేదాంట్లో రెండు తరాలకూ  ఎంతో నేర్చుకోవాల్సిన అవసరమూ ఉందనీ, ముఖ్యంగా మొదటి, మూడవతరాలకు ఒకరికొకరి అవసరం ఉందనీ, రెండో తరం తమ బాధ్యతలలో మునిగి తేలే వయసులో మొదటి తరం, మూడవతరం ఒకరికొకరు అవసరం అవుతారనీ, ఆసరాగా నిలుస్తారనీ , కోరి దగ్గరవుతారనీ నా అభిప్రాయం. అదే చెప్పాను. మీరెంతో చదువుతుంటారు. మీమాట సరిగ్గా ఉంటుందంది, తానింకా చదువుతుంది. అయినా అన్ని విషయాలకూ చదువుతో ముడిపెట్టడం అనవసరం అని నా అభిప్రాయం.

      పదేళ్ళ క్రితం ఒక మిత్రబృందం చర్చలో ఒకామె (ఇంకా పిల్లలు చిన్నవాళ్ళే) పెళ్ళైతే వాళ్ళను వేరే పెడతాను అన్నప్పుడూ  నాకెంత నచ్చలేదన్నదీ ఈరోజు గుర్తొచ్చింది. అప్పుడు నేనేమీ చెప్పలేదు. కానీ నా అభిప్రాయం ఏళ్ళు గడిచేకొద్దీ మరింత బలపడిందన్నమాట. బాగుంది. రెండు తరాల మధ్య రక్తసంబంధం ఉన్నప్పుడే ఇబ్బందులవీ ఉంటుంటాయని (నా అనుభవానికి రాలేదు గానీ) వింటుంటాము. అలాంటప్పుడు కొత్తవారితో కలిసి ఉన్నప్పుడు ఇబ్బందులని ముందే తొలగడం తప్పేమో అనే అనుకుంటాను.
     ఏదేమైనా ఎవరి మధ్య అపార్థాలు లేకుండా ఉంటే బాగుంటుందనే అందరూ కోరేది. 😊

సీరియస్ గా చదివి తీరాలని ఈరోజు తెచ్చుకున్న పుస్తకాలు క్షేమేంద్రుని ఔచిత్యవిచార చర్చ, దండి కావ్యాదర్శము. రెండూ సాహిత్య విమర్శగ్రంథాలే.
       

15, ఫిబ్రవరి 2018, గురువారం

ఎప్పుడూ లేను

ఏకాంతంలో నాలోనేను ఎప్పుడూ లేను.
ఎవరెవరున్నా ఏం చేస్తున్నా అప్పుడూ లేను.
ప్రతి శ్వాసా ఏదో ధ్యాసలోనే
ప్రతి పలుకూ వేరేదో తలపులోనే
వినిపించేదేదో వినవచ్చేదేదో
గమకమ్మౌ స్వరమో
అందీ అందని వరమో
నడిపిస్తోంది...సడిచేస్తూ.....

-----లక్ష్మీదేవి.

13, ఫిబ్రవరి 2018, మంగళవారం

ఎపుడో!

కొత్త చివుళ్ళు!

హరి చందనాలు అలదక
   వేళులు అలసిపోతున్నాయి.
ప్రియస్వాగతాలు పలుకక
   మది వీణ తీగెలు మూగబోతున్నాయి.
మురిపెంపు మాటలు కన రాక
    తలపులు అలిగిపోతున్నాయి.


ఎండుకొమ్మల కొత్తచివుళ్ళై
    కలలు ఊపిరులు పోస్తున్నాయి.
తడి తగిలించి కనుకొనలకు
    ఆకాంక్షలు  లాలపోస్తున్నాయి.
ఉండుండి తోసుకొని గురుతొచ్చే
   తొలి ఊసులు నగవుల నగలౌతున్నాయి.

దూరాల భారాలను తీర్చేటి
     చేరాతల కమ్మలందేదెపుడో
నని కనుగవలు నిరీక్షిస్తున్నాయి.

-----లక్ష్మీదేవి.

వైద్యుడే నారాయణుడు, హరి!

వైద్యులైన మిత్రులకు వందనాలు, వందనాలు!
(Shared one)

*Rediscover Your Doctor*

_*Do you know*_ that when treating you of your viral fever your doctor gets exposed to the virus?

_*Do you know*_ that when doing surgery your doctor gets cuts and pricks that may transmit disease from patient to doctor?

_*Do you know*_ that when your doctor dresses your diabetic foot, they feel nauseated by smell and do not feel like eating for the whole day?

_*Do you know*_ that when during a delivery the patient often passes urine and motion that may spills on the doctor?

_*Do you know*_ that even though your doctor's own child might be suffering from fever, he has to leave him to others as he has to go and treat others while his own child suffers?

_*Do you know*_ that for every delivery case your doctor has to attend at least 10 calls throughout night.. And then be back to work early next day?

_*Do you know*_ that when a neurosurgeon operates for 12 hours continuously he loses track of time and forgets to eat or sleep?

_*Do you know*_ that a cardiologist is exposed to dangerous levels of radiation in the lab

_*Do you know*_ that the life span of doctors is 10 years less than public average because of stress?

*A doctor doesn’t just work for money. With their level of intelligence they could earn more money had they chosen other professions.*

_*Please take a moment to thank all the Doctors!*_