Loading...

25, జనవరి 2018, గురువారం

ఊహల దారులలో

ఈ ఊహల దారులలో
కలిసి పడే అడుగులవేనా,
ఆ వినిపించే సడులు!

 వ్యామోహపుటడవులలో
 ఎదలయలకు జతలేమో
 ఈ నిశ్శబ్దపు ౙతులు?

 ఒక గమ్యపు ఎఱుక లేని గమనమిది!
 ఏ నిరాశలూ వెనుదిప్పలేని యానమిది!
 ----------లక్ష్మీదేవి.

జలపాతాలు

మింటి నంటు కొండ మీదుగా దూకేవీ జలపాతాలే!
 కంటి నుండి దిండు మీదుగా జారేవీ జలపాతాలే!
 చెట్లూ రాళ్ళల్లో అవి చల్లబడితే
 చిక్కులూ ముళ్ళల్లో ఇవి వెచ్చబడతాయి.
 దాహాలను అవి తీరుస్తుంటే
 మోహాలను ఇవి తొలగిస్తుంటాయి.
అయితే
వానాకాలాలకు ఒక ఋతువే గానీ
బాధాకాలాలకు అన్నీ తమ ఋతువులే.
------లక్ష్మీదేవి.

21, జనవరి 2018, ఆదివారం

రససౌహార్దము

ప్రముఖ హిందీకవి మైథిలీ శరణ్ గుప్తగారి తప్త్ హృదయ్ అనే కవితకు నా తెలుగు మాటలు

తపించే హృదయానికి రససౌహార్దము
సోకించేదొక స్నేహమే కదా!
వాడిన మదికి తోడై ముదమున
నీరాడించేదొక స్నేహమే కదా!
ప్రియ వియోగమున కలఁగిన చిత్తమున
నయమగు లాలననిడునదొక స్నేహమే కదా!
కనుల నొలికిన ఒక బిందువులోనే
మనసు కరిగించునదొక స్నేహమే కదా!