Loading...

2, అక్టోబర్ 2017, సోమవారం

తెలియడం లేదు

చిన్నప్పుడు
ఈ బాల్యం ఈ కాలం మళ్ళీ రావని
తెలియలేదు.

పెళ్ళప్పుడు
ఈ సంభ్రమం, సందోహం మళ్ళీ ఉండవని
తెలియలేదు.

మాతృత్వపు మాధుర్యాస్వాదనలో
ఆ ఆనందం, ఆ సమయం ఎప్పుడు
జారిపోతోందో తెలియలేదు.

ఇప్పుడు

ఏం తెలియట్లేదో
ఎప్పుడు తెలుస్తుందో
తెలియడం లేదు.

--లక్ష్మీదేవి.