Loading...

25, డిసెంబర్ 2017, సోమవారం

వరమై...

మృగతృష్ణలపై ఆక్షేపణలెందుకు? అవీ

మరుతృష్ణలకు ఆలవాలమౌతుంటాయి.

దిగలాగే దిగుళ్ళను తొలగిస్తూ

కొనసాగే తోడవుతుంటాయి.

మలుపులలో నిలిచినపుడే

కలవరమున కలఁగినప్పుడే


తలపులలో మది లోతులలో

కల  వరమై కనిపిస్తుంటాయి.

వెల తెలియని ఫలమౌతుంటాయి.

--------లక్ష్మీ దేవి.
మరు తృష్ణ = మళ్ళీ ఆశ, జీవితం పై మరల ఆశ కలగడం

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి