Loading...

3, నవంబర్ 2016, గురువారం

ఎందుకు?

అదంత తీపి దేమీ కాదు
మళ్ళీ మళ్ళీ నెమరేసేందుకు
అంత చేదు తనమూ లేదు
ఒక్కసారే మింగేసేందుకు

మరపురాని ఓ జ్ఞాపకమా!
గుండెలో గూడెట్టి
గొంతులో కెక్కొచ్చి
అడ్డు పడతావెందుకు?
ఊపిరుల్లో నిట్టూరుపువై
చూపుల దారుల్లో తివాచీవై
నిలుచుండిపోతావెందుకు?
----------లక్ష్మీదేవి.