Loading...

5, జులై 2015, ఆదివారం

పోరు మానవా నరుడా!

ఉన్నూరు వీడినా మున్నేరు దాటినా
పోరు మానవా నరుడా!
కయ్యాలు వీడితే నెయ్యాలు కూడితే
దారి తోచురా నరుడా!   ॥ఉన్నూరు॥మేలిమి మనసుల మెత్తని మాటల
కలిసి యున్నచో విజయమురా!
పాలనుఁ బోలిన చెలిమిని చెరిపే
విసపు చుక్కల వేసమెఱుగరా!   ॥ఉన్నూరు॥


సొంత లాభము కొంత చూసుకొను
స్వార్థశక్తుల యుక్తులను,
సాంతమెఱింగి పంతముతోడ
వ్యర్థమవ్వగా తిప్పికొట్టరా!   ॥ఉన్నూరు॥