Loading...

26, నవంబర్ 2015, గురువారం

ఈ నల్లని రాలలో అనే ప్రసిద్ధమైన అమరశిల్పి జక్కన చిత్రగీతపు రాగంలో....

ఈ నల్లని రాలలో అనే ప్రసిద్ధమైన అమరశిల్పి జక్కన చిత్రగీతపు రాగంలో....చందమామను గురించి..

ఈ చల్లని గాలిలో ....ఆ అల్లరి మామతో
నే మెల్లగ నడువగా....నా ఉల్లము పొంగునే.....!!
ఈ చల్లని గాలిలో.....!



దవ్వునున్న వాడయ్యును
నవ్వులెన్నొ కురిపించును.
పవ్వళించు వేళలోన
కవ్వించుచు కనిపించును.
ఈ చల్లని గాలిలో....!

పైన ఉండి మురిపించును
లోని గుండె కదిలించును,
తేనె లొలుకు వెన్నెలతో
ఇతడే, నా వాడనిపించును!
ఇతడేనా, వాడనిపించును!
ఈ చల్లని గాలిలో....!

3 వ్యాఖ్యలు:

  1. బుచికి బుచికిగా ఉంది పేరడీ.

    ప్రత్యుత్తరంతొలగించు

  2. ఈ ప్రసిద్ధమైన పాటను ఏ రాగంలోకంపొజ్ చేశారో (తెలిస్తే ) తెలియజెయ్యండి) .

    ప్రత్యుత్తరంతొలగించు
  3. నాకు సంగీతం గురించి తెలియదండి. కానీ ఈ మాట వ్యాసాల్లో పహాడీ (హిందూస్తానీ) రాగంలోనూ, మోహన(కర్ణాటక) రాగంలోనూ ఉన్న పాటల్లో ఈ పాటను ఉటంకించారు. మరి రెండూ ఇందులో ఉన్నాయా అన్నది కూడా నాకు తెలియదు. నాకు వ్రాయడం తెలుసు గానీ రాగాలు తెలియవు. నడక మాత్రం అలా ఉండేలా చూచుకున్నాను. ధన్యవాదాలు.

    ప్రత్యుత్తరంతొలగించు