Loading...

27, సెప్టెంబర్ 2015, ఆదివారం

అష్టావధానం || 03-10-2015 || శనివారం || సీతాఫల్ మండి వీరమాచనేని పడగయ్య ఉన్నతపాఠశాల

అష్టావధాన కార్యక్రమము- శనివారం 03-10-15 సాయంకాలం 4 PM - 6PM
స్థలం --వీరమాచనేని పడగయ్య ఉన్నత పాఠశాల, సీతాఫల్ మండి పై వంతెన (ఫ్లై ఓవర్) దగ్గర.
అవధాని : శ్రీమతి ఎమ్ కె ప్రభావతి గారు
సమన్వయకర్త : శ్రీ సి హెచ్ ప్రభాకర్ గారు
______________
పృచ్ఛకులు-----
1) డా. డి వి శ్రీనివాసాచార్యులు గారు ---నిషిద్ధాక్షరి.
2) శ్రీ గౌతురాజు హనుమంతరావు గారు ---- అప్రస్తుత ప్రసంగము
3) శ్రీ గొడవర్తి నరసింహాచార్యులు గారు---- దత్తపది
4) శ్రీమతి కె లలిత పరమేశ్వరి గారు ----పురాణపఠనం
5) శ్రీ ఎమ్ సాంబశివరావు గారు -----సమస్య
6) శ్రీమతి ఎన్ సత్యభామ గారు ----వర్ణన
7) శ్రీమతి టి సంపూర్ణ గారు ------ న్యస్తాక్షరి
8) శ్రీమతి పి జ్యోతి గారు ----నామావళి
ఈ విశిష్టమైన సాహిత్యపర్వమునకు అందరూ ఆహ్వానితులే.

2 వ్యాఖ్యలు:

  1. ఇక్కడ 'నిషేధాక్షరి' అన్నమాట వాడారు. ఈ మాట క్రొత్తగా ప్రచారంలోనికి వస్తున్నట్లు తోస్తున్నది. నాకు తెలిసి నిషిధ్ధాక్షరి అన్నది అనూచానంగా వస్తున్న పదప్రయోగం. నిషిధ్ధాక్షరికి సమానంగా మరొకటి వాడాలంటే నిషేధితాక్షరి కావచ్చును అనుకుంటాను. ఎంధుకంటే విగ్రహవాక్యంగా నిషిధ్ధమైన అక్షరములు కలది అని చెప్పినా నిషేధించబదిన అక్షరములు కలది అని చెప్పినా, అర్థబేధం ఉండదు. నిషేధాక్షరి అన్నదానికి విగ్రహవాక్యం ఏమని చెప్పాలి? ఇది ఆలోచనీయమైన విషయంగా అనిపిస్తోంది.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. సవరించానండి. శ్యామలరావు గారూ, ధన్యవాదాలు.
    నిషిద్ధ అనే వ్రాసినా కూడా దానికి ఆంగ్లవర్ణమాల లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాడుతుంటారు. ఇక్కడ కూడా అదే జరిగిందేమో మరి.
    నేను ఆంగ్లప్రతిని పోస్ట్ చేసేముందు తెలుగులో వ్రాసి పోస్ట్ చేశాను. బహుశా నేనే పొరబడి ఉండవచ్చు.

    ప్రత్యుత్తరంతొలగించు