Loading...

29, జులై 2015, బుధవారం

ఎన్నిరకాల పుష్కరాలో!

చీకట్లకు పక్షానికొక పుష్కరమే
కౌముదీ నదుల్లో మునకలేసేందుకు

సానువులకు అనుదినమూ పుష్కరమే
హిమసుమాలు కరిగే పావనతీరాల్లో

మంద్రసమీరాలకు అనుక్షణమూ పుష్కరమే
సుమసుగంధాల తరంగిణులలో

రసజ్ఞ హృదయాలకు భావనదుల్లో
క్షణక్షణమూ ఆనంద పుష్కరమే

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి