Loading...

22, మే 2015, శుక్రవారం

నవ భాష ఇది, రసకావ్యమిది.......అని పాడగ కవులేలా?

పల్లవి అనుపల్లవి అని ఒక కన్నడ చిత్రం తెలుగులో కూడా అనువాదం జరిగింది. ఇంత అందమైన భావాలు, మాటలున్న ఈ కన్నడ గీతాన్ని నా తెలుగు మాటల్లో అదే రాగంలో అదే భావాలతో (దాదాపు) వ్రాశాను. ఆసక్తి ఉన్నవారు అదే  బాణీలో పాడుకొని చూడవచ్చు.

పల్లవి -
నవ్వేకళ్ళు, మధురం మౌనం
ఎద స్పందనము- మరు ఊసేలా?
అనుపల్లవి -
నవ భాష ఇది, రసకావ్యమిది
అని పాడగ కవులేలా?
చరణం-
నీకొఱకు చెప్పేను పలు కథలను
నా నీవు నగవుల కురిపించగా
నిశిలోనె కంటిని చిరునవ్వును
కన్నుల్లో కనిపించు క్రొంగలలను (క్రొత్త కలలను)
వానల్లొ నడువంగ జత చేరనా?
నీ చేయి విడువక నేనుండనా?
సఖుని విడక జతగా ఎగుర
మిన్ను హద్దూ దాటీ రానా!

చరణం -
ఈ రేయి పాటల మురిపాలలో
నే గంటి తీయని దగు రాగము
నీవున్న నేనున్న ఏకాంతము
మనదైనదది ఒక్క నవలోకము
ఈ చెలిమి రూపము ఎదలోన
ఎన్నటికి చెరగని ముగ్గైనది
ఆశా సుమములు పరచి వేచా
కలను నలుపక నడచి రావా

ఇక్కడ నేను పెట్టిన పాటకు కవి రాజశ్రీ గారు కనులు కనులు కలిసే సమయం అనే స్వతంత్రగీతాన్ని(అనువాదం కాదని భావం) వ్రాశారు. అదీ బాగుంది. కానీ ఇంత అందమైన భావాలు, మాటలున్న ఈ కన్నడ గీతాన్ని నా తెలుగు మాటల్లో అదే రాగంలో అదే భావాలతో (దాదాపు) వ్రాశాను. ఆసక్తి ఉన్నవారు అదే  బాణీలో పాడుకొని చూడవచ్చు.

2 వ్యాఖ్యలు:

  1. చాలా బాగుంది అండి. ఎక్కడా dubbing పాటలా కాకుండా శ్రావ్యంగా ఉంది. నెనర్లు!

    ప్రత్యుత్తరంతొలగించు
  2. నాకూ అనిపించింది. ఎందుకిది ఎవరికీ నచ్చలేదా అని. :P
    మొత్తానికి మీకు నచ్చింది. సంతోషం.

    ప్రత్యుత్తరంతొలగించు