Loading...

10, ఏప్రిల్ 2015, శుక్రవారం

నా హృదయమిది!!

పొదివి పట్టుకో నా హృదయమిది
మృదుల హృది పేటిక లోలోపల
చెదరనీకుమా నా వన్నెల స్వప్నమిది
నిదురపోయినా మెలకువనైనా
పొదిగిన ముత్యాల అనుభూతులివి
పదిలము పదిలము ఎప్పటికీ

వెన్నెల కిరణాలై కరములు చుట్టినవేళ
హృదయకుముద పరిమళం భాసిస్తున్నవేళ
నిశాంతము దనుకా ఈ ప్రశాంతతలో
ముకుందా నన్ను పరవశించనీ!

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి