Loading...

3, జనవరి 2015, శనివారం

ఎన్నో!

నీటి కోటకు మాటున నిగ్గుఁ జూపని రంగులెన్నో!
కన్నీటి చాటున నిజాలెన్నో! నీడలెన్నో!

పాట లో లోతులో దాగిన గోడులెన్నో!
కాటు ధాటికి కోలుకోని మోడులెన్నో!

ఆకులెన్నో రాలినటులే
చీకు చింతలు రాలవేలో!
కొత్త చివురుల పలకరింపుల
పొత్తు లొసగెడు నవ వసంతపు
గాలి వీచగ జాలి యెపుడో!

2 వ్యాఖ్యలు:

  1. నిరాశా నిస్పృహలు కొత్త చివురుల పలకరింపుల
    పవనాల కోసం చూసే ఆశావహ ఎదురుతెన్నులు
    వేదనాభరితంగా, చిన్న కవితలో ఎంతో అర్ధవంతంగా
    వివరించారు. కానీ విధికి కాస్తంత కఠినత్వం ఎక్కువ
    కారుణ్యం తక్కువ అనిపిస్తుంటుంది.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. :)
    అవునవును.
    కానీ స్థూలదృష్టితో చూస్తే కారుణ్యమే కదా ఉన్నదంతా అనిపిస్తుంది.

    ప్రత్యుత్తరంతొలగించు