Loading...

3, జనవరి 2015, శనివారం

ఎన్నో!

నీటి కోటకు మాటున నిగ్గుఁ జూపని రంగులెన్నో!
కన్నీటి చాటున నిజాలెన్నో! నీడలెన్నో!

పాట లో లోతులో దాగిన గోడులెన్నో!
కాటు ధాటికి కోలుకోని మోడులెన్నో!

ఆకులెన్నో రాలినటులే
చీకు చింతలు రాలవేలో!
కొత్త చివురుల పలకరింపుల
పొత్తు లొసగెడు నవ వసంతపు
గాలి వీచగ జాలి యెపుడో!