Loading...

25, అక్టోబర్ 2014, శనివారం

వినలేవా?

తలపుల పిలుపులు వినలేవా?
తెలుపక మనసునుఁ గనలేవా?
        కలలోనైనా రాలేవా...... న్యాయమా?

చిలుకలు మఱచెను పలుకులు
తొలకరి లేదనె చినుకులు
నిలుకడ వీడెను చూపులు
       పలుకర స్వామీ ఇకనైనా.... ప్రేమగా!

మెలకువతోడనె కునుకులు
జలజల మనె కనుకొలకులు
వెలుగుల నింపగ రావేరా జగమున
       కొలిచెద నిరతము నిన్నే.....నా మనమున!