Loading...

24, సెప్టెంబర్ 2014, బుధవారం

నిను చేరగా......

కరిమబ్బు తొలిచినుకునై నిను చేరగా......
తెలిమబ్బులో వేచి యుండనా............... ప్రియతమా!

నెలవంక తొలికిరణమై నినుచేరగా......
సినీవాలిలో దాగి యుండనా............ ప్రియతమా!

విరినగవుల సిరుల తోడుగా నిను చేరగా......
ముకుళించిన మొగ్గ యురమునుండనా............ప్రియతమా!

అల సమీరాల కలలాలనగా నిను చేరగా........
ఊపిరులూదే యెల చిగురుగా మారనా............ప్రియతమా!

హరివిల్లులో గురిబాణమై నిను చేరగా.....
లేయెండ మెరుపునై వెలుగనా.............ప్రియతమా!

1 వ్యాఖ్య: