Loading...

8, జులై 2014, మంగళవారం

తేనె ధారలూ వీనుల విందులూ!

      చీకట్లో చెట్టూ చేమల్ని మనసారా పలకరించి, చేతులారా నీలాలు పోసి, చేతులు పట్టుకొని చెమ్మాచెక్కాలాడించి, నవ్వించి కవ్వించి తెలతెలవారుతుండగా మాయమైపోయింది వానమ్మ. ఆ ఆనందపు ఛాయలు ఇంకా పోలేదు ఈ కొమ్మల రెమ్మల్లో.. అదుగో పఱచుకొన్న ఎండల్తో, ఎగురుతున్న పిట్టల్తో చెప్పుకుంటూ ఉన్నాయేమో.. ఎండ చల్లబడినట్టు లేదూ! పిట్టలు ఆనందంగా పాడుతున్నట్టు లేదూ!

వానమ్మా! రావమ్మా! దివి దిగిరావమ్మా!
తేనెలధారలుగా భువి నభిషేకించమ్మా!

కానక కన్నులు కాయలు కాచెననే
మానవ జాతికి నూపిరులూదమ్మా!
నేలనుఁ బుట్టిన ప్రాణుల పైదయ
మానకు, మబ్బుల దిగిరావమ్మా!

వీనుల పడగనె చినుకుల తాళము

గానము మోహన పరవశమమ్మా!
మేనులు పులకరమందగఁ జేయుము
యానము , చేరగ పుడమిని రావమ్మా!

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి