Loading...

15, జూన్ 2014, ఆదివారం

మది కోరుతుంది...

           మబ్బులరేడు చినుకుల చేతులతో భూదేవి బుగ్గలకు గంధం వ్రాస్తున్నాడా అన్నట్టు మట్టి సువాసనలు చుట్టుముట్టినాయి.
         అవనీ లలామ చెలుని ముచ్చట పలుకుల గుసగుసలన్నట్టుగా పైనుండి రాలు చినుకుల చిటపటసవ్వడులు చెవులఁ జేరుతున్నాయి.
         కచేరికి ఆలస్యమైతుందేమోనన్నట్టు వీణావాదన మధురిమలు ఎక్కడ కోలుపోతుందో బిడ్డ అన్నట్టు పాదాలు మనసు నెత్తుకొని అడుగులు వేస్తున్నాయి.
         మనోౕజ్ఞమైన దృశ్యము చూచిన వెంటనే వెన్వెంటనే రసజ్ఞులతో పంచుకోమని చేతివేళ్ళను మది కోరుతుంది.

8 వ్యాఖ్యలు:

  1. ఆ మట్టి వాసన ఇంకా నాసికకు చేరలేదు కానీ..
    ఈ అక్షర సుమమ్ముల మధురిమలు మదిని చేరగనే
    ఏవో పన్నీటి జల్లులు చిలుకరించినట్లే ఉన్నది చెలీ!

    ప్రత్యుత్తరంతొలగించు
  2. హాఁ...! సుభాషిణీ!
    బయట వానచినుకులు! ఇచట మీ పలుకులు! అదే కొత్తపరిమళాలు. :)

    ప్రత్యుత్తరంతొలగించు
  3. నెచ్చెలుల చెణుకులు
    తీయ చెరకు కణుపులు
    ఆనందపు తళుకులు
    ఎద తేనెల ఊటలు

    ప్రత్యుత్తరంతొలగించు
  4. వాహ్ రావు గారు! భలె బాగా చెప్పినారు!

    ప్రత్యుత్తరంతొలగించు
  5. on the revisit ma'm...
    ఎద తేనియ తరకలు ...
    looked more rythmic...

    thanx for the appreciation ...

    ప్రత్యుత్తరంతొలగించు
  6. నిజంగా! బాగుంది. మీ పాటలు కవితలు కూడా బాగుంటాయి.

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. సాక్షాత్ శారదానుగ్రహమే మీ ప్రశంస ...

      indebted ...
      మనసా...
      శిరసా...
      వందనం.

      తొలగించు
  7. హాఁ...! ఎంతమాట! ప్రతి వారినీ పలికించేది ఆ అమ్మే కదా!

    ప్రత్యుత్తరంతొలగించు