Loading...

17, మే 2014, శనివారం

కృష్ణశాస్త్రి గారి నాటిక

             నేనింత వరకూ కృష్ణశాస్త్రి గారి కవిత్వం చదివినాను గానీ నాటికలు చదవలేదు. కొత్తకోవెల అనే పేరుతో ఉన్న వారి నాటికల సంకలనాన్ని ఈ మధ్యే చదివినాను. వాటిల్లో సహజంగానే నా దృష్టిని ఆకట్టుకొన్నది భువనవిజయం అనే నాటిక.
         అల్లసాని పెద్దన వారి రథాన్ని స్వయంగా కవిరాజూ, రాజకవీ అయిన సాహిత్యమూ, పాలనా, పోషణా, లాలనా, సంగరరంగమూ ఇటువంటి అన్ని ప్రాంగణాలకూ సార్వభౌముడైన రాయల వారు మోసే ఘట్టమూ, మనుచరిత్ర మొదటిసారిగా జనులకు వినిపించే సన్ని వేశమూ, ఆ యా సందర్భాలలో భువనవిజయములోని అష్టదిగ్గజాలనూ మనకు చూపించే సన్నివేశమూ అందంగా అమరించి, కొంతసేపు ఆ అద్భుతమైన విజయనగర సామ్రాజ్య విహారము చేయిస్తారు.
సరదా సన్నివేశాలూ ఉంటాయి. సాధారణంగా నాటికలంటే ఇష్టపడను గానీ పుస్తకంపేరూ, రచయిత పేరూ చూసి కవిత్వమే అనుకొని కొన్నాను గానీ ఏ చిన్ని పుస్తకమూ, పేజీ కూడా చేతిలో ఉండి చదవకుండా ఉండలేని నేను చదివినాను.
            భువనవిజయం నాటిక చదివినాక సంతృప్తి కలిగింది. ఆధునికపోకడలో మొత్తం మానవజాతి ప్రస్థానాన్ని, భారతజాతి ప్రస్తావన ఉన్న నాటిక, పండుగల సంబరాలను తిరిగి తెచ్చుకుందామంటూ ఒక సరదా నాటిక వంటి వాటికన్నా భువన విజయం నాకు నచ్చింది. నిజానికి అన్ని నాటికలూ బాగా వ్రాసినారు.

2 వ్యాఖ్యలు:

  1. కృష్ణశాస్త్రిగారు నాటికలు రాసేరని నాక్కూడా తెలీదు. మీ పరిచయం బాగుంది.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ధన్యవాదాలండీ. ఐదూ చక్కగా వ్రాశారండి. నాకిష్టమైన వస్తువు మాత్రం ఇది.

    ప్రత్యుత్తరంతొలగించు