Loading...

2, అక్టోబర్ 2013, బుధవారం

లేమ----లేతరెమ్మ

చెలుని చూపులు తాకినచోటల్లా
        పులకలెత్తిన మేనులా

చినుకు తూపులు రాలిన చోటల్లా
       తుళ్ళిపడుతున్న ఆకులు.......

నెచ్చెలి భుజంతట్టి కళ్ళెగరేసి చెలుడు చేసే సల్లాపాలకు
      సిగ్గుతో ముఖం తిప్పుకున్నపుడు సోలిపోయే లేమ కంటిఱెప్పలల్లే

చిరుగాలి పలకరించినట్టల్లా
    ఊయలలూగినట్టుగా అటునిటు వాలిపోయే లేతరెమ్మలు.....

కన్నుల విందులౌ చిరుజల్లుల్లో......................
బహుపసందౌ తొలివలపుల్లో................!!!!!!!!!