Loading...

18, ఆగస్టు 2013, ఆదివారం

వేణుధరా, వేల ప్రణతులు!నీలాల యమునానది నీళ్ళు కుండలలో నింపి నడిచే ప్రౌఢల్లా భారంగా కదులుతున్న నల్లమబ్బులు....
దరహాసచంద్రికలు జల్లు  చంద్రవంశతిలకుని దర్శనంతో  గోపికల కంటి ఆనందభాష్పాలలో కరిగే దిగులనే కాటుకలై శశాంకుని గనగానే తరువుల నీడలకరుగుతున్న చీకటులు.....
పచ్చటి మొక్కల పెళ్ళిపీటలను భూదేవి పరిచి ఉంచగా...
బంగరు చుక్కల పందిళ్ళను నింగమ్మ కట్టి ఉంచగా....
మెరుపుల దండలు మార్చుకుంటుండగా....
మరులను జంట కనులు బంతులాడగా....
 శ్రావణమాసంకోసం భూదేవమ్మ కట్టిన పట్టుచీర......:)
పరమానందమౌ కళ్యాణం...
మురిపెమ్మగునీ కళ్యాణం.......