Loading...

11, జులై 2013, గురువారం

వానకారు



చిగురాకుల శయ్యపఱిచి చినుకుల పూలనుఁ జల్లి తరువులన్ని తెరలుగా వరుణుని స్వాగతించు గిరికన్నియ తడబడు తలపుల తలపులను తెఱిచి తడిసిన ఊహల రెక్కల విదిలించి మదినేలే వానికై మనసారగ తనలోగిలిలోగిలిగింతల తనువొసగగ దఱిజేరిన వానకారు ఇది.