Loading...

15, జూన్ 2013, శనివారం

చెట్టూ చేమల తల్లికి వందనం!

లోకాలకే తల్లికదూ,
మబ్బుల్లో నీళ్ళు నింపి బాలాంకురాలకు లాల పోస్తూ,
గాలి ఉయ్యాలలో తరుశిశువులను ఊపుతూ,
కోకిల గొంతులో జోలలు పాడుతూ,
పూలమా(బా)లలతో అలంకారాలు చేసి ముచ్చటగా చూసి మురిసిపోతూ,
పుప్పొడులు మోసే సీతాకోకచిలుకల పురోహితులతో పెళ్ళిళ్ళు చేస్తూ,
బిడ్డల కడుపున కాయలు కాస్తే మురిసిపోతూ.....................!!!!!!!!!!!!!!!!!!