Loading...

9, డిసెంబర్ 2013, సోమవారం

చైతన్యవంతమైన సమాజం

       ఎప్పుడూ రాజకీయంగా చైతన్యవంతమైన సమాజం మనది. ప్రతీ తరంలోనూ ఈ సంగతి నిరూపించబడుతూనే ఉంది. సహనం ఎక్కువైనప్పటికీ ఒక స్థాయి దాటితే తిప్పికొట్టగలమని పదేపదే నిరూపించిన భారతజాతి మనది.
     
       అవినీతితో నిండిపోయి స్థానిక సమస్యలను పట్టించుకోని రాజకీయదళాలను ఇంక మీదట భరించే ప్రశ్నే లేదని మనదేశ రాజధాని లో ఆ మ్ ఆద్మీ దళాన్ని ప్రజలు మెచ్చుకోదగ్గ  సంఖ్యలో గెలిపించి చూపించినారు. అనేక సందర్భాల్లో జాతీయదళాల్ని తిప్పికొట్టి ప్రాంతీయ దళాల్ని ఈవిధంగా గెలిపించినది కూడా మనందరికీ తెలిసిందే.
   
    గత శతాబ్దాల్లో విదేశీయుల్ని తరిమికొట్టి స్వతంత్రత పొందినట్టే ఇకమీదట జాతి ద్రోహులకు వారి స్థానాన్ని చూపించి తీరుతామని ఒక హెచ్చరిక ఇది. దేశవ్యాప్తంగా ఈరోజు సాధారణ మనిషి కోసం ఏర్పడ్డ దళం నుంచి స్ఫూర్తి పొంది ఎక్కడికక్కడ స్థానిక దళాలు ఏర్పడడం ఎంతైనా అవసరం. మొత్తం రాష్ట్రానికి ఒకే రకపు హామీలియ్యడం కాక హస్తినలో ఏ వార్డు సమస్యలకు దానికి తగ్గ పరిష్కారాలకోసం హామీపత్రాలను తయారుచేసి ఈ దళం కొత్త ఆలోచనలకు నాందిపలికింది. ఈ పద్ధతుల గురించి మరిన్ని కొత్త ఆలోచనలు రావలసి ఉంది.
    
       గుడ్డెద్దు చేలో పడినట్టు ఆధార్ అభాసుపాలైనట్టు ఇకముందు భారతప్రభుత్వం చేపట్టే పనులు కాకూడదంటే బాధ్యతతో సంబంధిత వర్గాలతో , న్యాయనిపుణులతో సంప్రదించి (తూతూ మంత్రంగా కాకుండా) చర్చలు నిర్వహించ, బహిరంగ చర్చల నాహ్వానించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఈరోజు కేంద్రప్రభుత్వం ఆధార్ గురించి పట్టుబట్టవద్దని చమురు కంపెనీలకే చెప్పిందని విన్నాం కదా!
హస్తిన ప్రజలకు అభినందనలు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి