Loading...

22, నవంబర్ 2013, శుక్రవారం

రాయలసీమ ప్రజలెవరూ కోరలేదు!

రాయల సీమ ప్రజలంతా సమైక్య ఉద్యమం మొదలైనప్పటినుంచీ ఎంతో అంకితభావంతో పాల్గొంటున్నారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి సమైక్యంగా ఉండాలని ఉద్యమం చేస్తున్నారు. అంతేకానీ తెలంగాణా లో చేరతామని దేబిరించలేదు. రాజకీయనాయకులు వాళ్ళ స్వప్రయోజనాలకోసం లేదా రాజకీయ లబ్ధి కోసం రాయల తెలంగాణ ప్రతిపాదన తీసుకొని వచ్చినారు. కలిసి ఉండాలని కోరేవారు విడిపోతామని కోరుతున్నవాళ్ళతో కలిసే ప్రస్తావన రాదు. ప్రజలు కోరుకోలేదు. స్వార్థపరులైన రాజకీయ నాయకులు పౌరుషం విడిచి పెట్టి కోరితే అది మీడియాలో వస్తుంది. తెలంగాణ విడిగా కావాలని కోరేవారు అది చూసి చదివి మాకు రాయలసీమ వద్దు, వద్దంటే సిగ్గు లేకుండా ఎందుకు వస్తారనడం సరికాదు. రాజకీయ నాయకులు చేసే కుయుక్తులు, వంకరమాటలు విని వాటికి ప్రజలను బాధ్యులను చేయవద్దు. రాయలసీమ ప్రజలు సమైక్యం మాత్రమే కోరుతున్నారని నేను భావిస్తున్నాను. ఒకరిద్దరు రాజకీయనాయకుల నుంచి తప్ప ప్రజలనుంచి ఈ విన్నపం వచ్చిందనటానికి ఏ సాక్ష్యమూ లేదు. కనీసం బలపరచనూ లేదు. ఐక్యతయే బలము.

4 వ్యాఖ్యలు:

 1. ఎట్టి పరిస్థితుల్లొను ఆ తెలబాన్లతొ కలిస్తే దుంప నాశనమే వాళ్ళు కష్ట పడరు. పక్క వాడిని సుఖపడనివ్వరు.ఏడుపుగొట్టు, అసూయ సమాజం. అందుకే నిజాం వీళ్ళని ఊరవతలే ఉంచాడు. దగ్గరకు రానివ్వలేదు. ఈ గుడుంబ, గోచి డప్పు గాళ్ళు ఎంత విశ్వాస హీనులో తెలుసు కాబట్టే హైదరాబాద్ పరిసరాల్లోకి అడుగు పెట్టనివ్వలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. బాగా చెప్పారు. విడిపోతామంటున్న వాళ్ళు సీమాన్ద్రులపై కక్కే విషం అంతా ఇంతా కాదని అందరికీ తెలిసిందే. వాళ్ళ పరిస్తితులన్నిటికీ సీమాన్ద్రులే కారణం అని అనడంలో ఏమైనా అర్ధం ఉందా? వారు ఆ నిజాం కాలపు మానసిక స్థితిలోనుండి ఎప్పుడు బయట పడతారో!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. "కలసి వుండాలని కోరేవారు
  విడిపోతామని కోరుతున్నవాళ్ళతో
  కలిసే ప్రస్తావన రాదు...................... ...!"
  >> మీరు రాసింది మీకైనా అర్ధమవుతుందా లక్ష్మి గారూ?
  విడిపోతామని కోరుతున్నవాళ్ళతో
  కలిసే ప్రస్తావన రాదు
  అన్నప్పుడు ఈ తెలంగణతొ కలసి సమైక్యంగా వుటామనడం .....
  తెలంగణా ప్రజలు ఒప్పుకోకపోయినా ( వాళ్ళ మక్కెలిరగతంతూ )
  బలవంతంగా కలసి వుందామనడం
  మీకు ఎలా సబబు అనిపిస్తొంది?
  రాయల తెలంగాణా ఎంత అసంబధ్ధమొ
  ఈ బలవంతపు సమైక్యత ... సమైక్యాంధ్ర ... కూడా అంతే అన్యాయమని, అసంబధ్ధమని అనిపించదం లేదా?
  తెలంగాణాలొ 1200 మంది బలిదానాలు, ఆ తల్లుల గర్భశొకాలు, ఉద్యమం మీకు కనిపించదం లేదా?
  తెలంగాణా ప్రజలకు ఎలాంటి ప్రజాస్వామిక హక్కులూ లేవా?
  ఇంకొ ప్రాంతం పై బలవంతంగా పెత్తనం చేసే హక్కూ,
  దోచుకునే హక్కూ
  అన్ని హాక్కులూ మీకేనా?
  మాది మాకే కావాలి... మీది కూదా మాకే కావాలి
  అనడంలో ఎమైనా మానవత్వం వుందా తల్లీ?

  ప్రత్యుత్తరంతొలగించు
 4. అందరికీ నమస్కారం.
  నేను ద్వేష పూరితమైన వ్యాఖ్యలు చేయలేదు. చేయను. విడిపోతామని కోరుతున్నది ప్రజలు కాదు.కొందరు నేతలు మాత్రమే. వారితో గొంతు కలిపేది లేదనే నేనన్నాను.
  మూడుప్రాంతాల ప్రజలు కలిసి ఉన్నారు. స్వంతలాభం కోసం కొందరు సృష్టించిన అపోహలు తొలగిన నాడు మళ్ళీ కలిసే ఉంటారు.

  ప్రత్యుత్తరంతొలగించు