Loading...

9, మే 2013, గురువారం

ఏమో ఏమో అవి!!!!!!!!!!

చూపుల కలయికలో మెఱిసిన మెఱుపులా ,
తళుకు తారలా అవి? అంతగా వెలిగిపోతున్నాయి!!!!!!!!

మనసుల కలయికలో మురిసిన కలలా,
తెల్లని మబ్బుతునకలా అవి? గాలిలో తేలుతూ సాగుతున్నాయి!!!!!!!!!

కడగంట జారిన బిందువులు అశ్రువులా,
వాన చినుకులా అవి? మదిని తడుపుతున్నాయి!!!!!!!!!

వెచ్చగా తగులుతూ తాకుతున్నాయి ఊపిరులా,
చల్లగాలులా అవి? ప్రాణం పోస్తున్నాయి!!!!!!!!!!!!!!!!

2 వ్యాఖ్యలు: