Loading...

3, జనవరి 2013, గురువారం

మేలమాడబోకే చెలియా.....!

మేలమాడబోకే చెలియా.....!
నీలవేణీ! నీలి చీర నీ మాధవుని తలపున కట్టినావో?
జాలి చూపేలా? వేణుధరుని దరిసెనమున జాగౌనో?
పాలబుగ్గల చిన్నదానా? పసిడి మనసే జారెనేమో?
పూలనడుమ కూరుచున్న పొంకమింకా మెఱిసెనమ్మో!
ఏలుకొనగా గోపబాలుడు రానిదేమని చింతలేమో?
చెలులు నీపై అలిగినారే, వారినసలు కలువలేదో?
కలల తేలే పల్లకీ దిగి, కానరావే పడతులకును.
మాలలల్లి ఉంచినారే వారుమీకు దంపతులకును.

5 వ్యాఖ్యలు:

  1. బాగుంది మీ 'చిత్ర' భావన లక్ష్మీ దేవి గారూ!...@శ్రీ

    ప్రత్యుత్తరంతొలగించు
  2. కలల తేలే పల్లకీ దిగి, కానరావే పడతులకును.
    మాలలల్లి ఉంచినారే వారుమీకు దంపతులకును.
    chaala baagaa vrasaaru,,

    ప్రత్యుత్తరంతొలగించు
  3. మీ స్పందనకు, ప్రోత్సాహానికి ధన్యవాదాలండి.

    ప్రత్యుత్తరంతొలగించు