Loading...

28, డిసెంబర్ 2012, శుక్రవారం

మంచిదారి చూపించు

 మనుష్యులకు మంచినడత నేర్పి,
మంచిదారి చూపించు భగవంతుడా!!

నాగరికమ్ము పేరిట వినాశపు సంస్కృతి పెచ్చరిల్లె నీ
వేగపు జీవితమ్మిచట పీడన పెంచుచు నశ్వరమ్మునీ
లాగున తెచ్చె; కావుమిక రక్షణ సేయవె సంస్కరించుచున్
రాగల రోజులందున సలక్షణమైన తెనుంగు పిల్లలన్.

ఇల సంస్కారము బెంచు విద్యలకు దానిల్లౌ ప్రదేశమ్మునన్
కలకంఠిన్ కడు దుష్కరంబుగ మహాకాఠిన్యులై చంపుటే?
కలికాలమ్మన నిట్లహో! మిగుల శోకమ్మందు నల్లాడు కాం
తల బాష్పంబులు_ భీషణాస్త్రచయమై దండించు దుర్మార్గులన్. 


వ్యాఖ్యలు లేవు: