Loading...

24, నవంబర్ 2012, శనివారం

చూపుల పూల తివాచీని పఱచి యుంచనా?


అడుగులు కందకుండగా నీవు నడచి వచ్చు దారిలో
చూపుల పూల తివాచీని పఱచి యుంచనా?
నీ యలికిడి చెవులను బడకుండెనే,
యూపిరి తీయు సడి నాపుకొందునా?
మాయని చిరు నగవుల బాయని ముఖమెన్నడు
కానవచ్చునో యని కనుమూయక వేచియుందునా?
కరముల మాలలు నీ యురముల నుంచెద
సరగున నీ వరుదెంచు సుముహూర్తంబదెన్నడో?
నిరీక్షణమే పరీక్షయైనది వీక్షణముల క్షణములే
అక్షయము జేయు దక్షత మనలో గలదా?

3 వ్యాఖ్యలు: