Loading...

9, అక్టోబర్ 2012, మంగళవారం

చ్చచ్చచ్చ

చిచ్చులు పెట్టుచు వచ్చెడి చిచ్చరకంటి వైరి
అచ్చపు విరిబాణములతో గుచ్చినచో
వెచ్చని నెచ్చెలివోలె పచ్చిక ముచ్చటగొలుపునో!
ఇచ్చెరలో చచ్చుట సుఖమేనా?
నచ్చిన సఖికై మెచ్చిన చెలుడు వచ్చుట
మచ్చిక తోడ ముచ్చటలాడుట
అచ్చరులే అచ్చెరువొందే కుచ్చుల జడల వయ్యారి
విచ్చిన పుచ్చపువ్వంటి వెన్నెల్లో గిచ్చినా
నొచ్చునా? అచ్చొచ్చిందనునా? మనసే
ఇచ్చి పుచ్చుకొనునా?
(.....సరదాకి....)

15 వ్యాఖ్యలు:

 1. చ్చచ్చచ్చచ్చచ్చచ్చ చ కారం తో కవిత చమత్కారంగా వుంది

  ప్రత్యుత్తరంతొలగించు
 2. విచ్చిన పుచ్చపువ్వంటి వెన్నెట్లో...
  మనసిచ్చిపుచ్చుకున్న ముచ్చట్లు మాకిచ్చి
  అచ్చమైన మెచ్చుకోలు... ముచ్చటగా తీసుకొనేది లచ్చిమే కదా!...
  @శ్రీ

  ప్రత్యుత్తరంతొలగించు
 3. గోపాలకృష్ణ గారు,
  :))
  తెలుగుపాటల వారు,
  చాలా రోజులకు కనిపించారు. ఈ మధ్య పాటలు పెట్టడం లేదేం?
  ధన్యవాదాలండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. పూర్వఫల్గుణిగారు,
  ధన్యవాదాలండి.
  శ్రీ గారు,
  అమ్మో, మీతో పోటీ పడగలమా ?
  ఇచ్చకాలు నచ్చినాయి. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఓహో నెచ్చెలీ! ఇచ్చటికే వచ్చితినీ..
  స్వఛ్ఛముగా మెచ్చితినీ..
  (ఊరికే సరదాగా అన్నానండీ.. మిమ్మల్ని మెచ్చుకునేటంత పెద్దదాన్ని కాదు.. మన్నించేయండి:) )
  చాలా బాగుంది. మరేం చేస్తాం చెప్పండి.. మీరెలా వ్రాస్తే అలానే చెప్పేయాలని ఉంటుంది నాకు..కానీ నాకేమో రాదు. నాకు పద్యాలు వ్రాయడం నేర్పించరూ.. ప్లీజ్.
  -సుభ

  ప్రత్యుత్తరంతొలగించు
 6. సుభాషిణి గారు,
  ఈ మన్నింపులవీ ఏంటండీ, మీరంతా మెచ్చుకుంటే వచ్చే ఆనందమే వేరు.
  పద్యాలు వ్రాయడం నేనూ బ్లాగుల్లోకి వచ్చాకే అందరూ ప్రోత్సహించాకే నేర్చుకున్నానండీ. కొంచెం పట్టుదల ఉంటే వచ్చేస్తుంది.
  వచ్చినంత మాత్రానా ఏముందండి? మందార మకరంద మాధుర్యాలు తెలిసిన మన తెలుగువారిముందు నా రచనలు గడ్డిపూల విలువ కూడా చేయవు.
  మీ అభిమానానికి ధన్యవాదాలండీ.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. గడ్డిపూల విలువ తక్కువనా మీ ఉద్దేశ్యం? ఆ పూలు నచ్చని వాళ్ళెవరూ ఉండరు నాకు తెలిసున్నంతలో. ఆ మందార మకరంద మాధుర్యాలు మీ కవితల్లో చెప్పలేనంత ఉంటాయండీ.. ఇది నేను మనఃస్పూర్తిగా అంటున్న మాటండీ.. అతిశయోక్తి ఎంత మాత్రం కాదు.
  -సుభ

  ప్రత్యుత్తరంతొలగించు
 8. "సు"భాషిణీ,
  పేరును సార్థకం చేసుకునేలా పలికి , ప్రొద్దున్నే నా మనసులో తేనెలు కురిపించారు.
  మురిసిపోయానంటే నమ్మండి. మీ అభిమానానికి ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. అన్నట్టు గడ్డిపూల అందమే వేరు. నేనూ తదేకంగా చూడకుండా ఉండలేను వాటిని. బుల్లిబుల్లి పూలు. కాకపోతే అలంకరణలో, ఆరాధనల్లో ఎవరూ పట్టించుకోరు కాబట్టి వాటినలా అంటూ ఉంటారు. అంతే సుమా!

  ప్రత్యుత్తరంతొలగించు
 10. హలో అండీ !!

  ''తెలుగు వారి బ్లాగులు'' తరుఫున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు !!

  వెలుగు జిలుగుల దీపావళి నాడు ఆ లక్ష్మీ మాత కటాక్షం
  ఈ యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ కలగాలని ఆశిస్తూ ...
  ఒక చిన్న విన్నపము ....!!

  రాబోయే నెల డిసెంబర్ 2 వ ఆది వారము (తెలుగు బ్లాగుల దినోత్సవం) లోపల ఒక వెయ్యి తెలుగు బ్లాగులను ఒకదరికి చేర్చాలని సంకల్పించటమైనది

  మీరు అనుమతించి నట్లైతే మీ బ్లాగును కూడా తెలుగు వారి బ్లాగుల సముదాయం లో జతపరిచేదము.
  మీ అంగీకారము తెలుపగలరు

  http://teluguvariblogs.blogspot.in/

  ప్రత్యుత్తరంతొలగించు
 11. తప్పకుండానండీ. సంతోషంగా అంగీకరిస్తున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. భలే ముద్దుగా ఉందండీ మీ 'చ్చ' ప్రయోగం..

  ప్రత్యుత్తరంతొలగించు
 13. మధురవాణి గారు,
  ముచ్చటైన మీ వ్యాఖ్య తో ఇంకొంచెం ముద్దొస్తోంది సుమా!

  ప్రత్యుత్తరంతొలగించు