Loading...

2, సెప్టెంబర్ 2012, ఆదివారం

సౌందర్యరాశి

మేఘుని చూపుల చినుకుల్లో
తడిసిన ప్రకృతి కన్నియ హొయలు...!
హొయలును గనిన మేఘుని కన్నుల్లో
మెరిసిన మెరుపుల వెలుగులు.....!!
నిత్యనూతనమైన ఈ జంట మనసుల్లో
చిగుళ్ళు వేసిన కొత్త రంగుల ఆశలు....!!!
మరులు పెరిగిన తరుణంలో
మారాకు వేసిన తరువులు....!!!!
విరుల మధుజలములలో ఘంటాన్ని అద్ది
తేనె సంతకాలు చేస్తున్న భ్రమరవరులు....!!!!!!!!

మనసును దోచే , మై మఱపించే సౌందర్యరాశి ఈ ప్రకృతి......
ప్రకృతి ముందు ప్రపంచ సుందరీమణులు నిలువగలరా?

20 వ్యాఖ్యలు:

 1. నా భావాలు మీకు నచ్చినందుకు సంతోషమండీ, సత్వరస్పందనకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. కవిత సాంతం బాగుంది...
  "విరుల మధుజలములలో ఘంటాన్ని అద్ది తేనె సంతకాలు చేస్తున్న భ్రమరవరులు"..
  చాలాబాగుంది ఈ భావం లక్ష్మి గారూ!
  అభినందనలు..

  @శ్రీ

  ప్రత్యుత్తరంతొలగించు
 3. కవిత సాంతం బాగుంది...
  "విరుల మధుజలములలో ఘంటాన్ని అద్దితేనె సంతకాలు చేస్తున్న భ్రమరవరులు"
  చాలాబాగుంది ఈ భావం లక్ష్మి గారూ!
  అభినందనలు మీకు.
  @శ్రీ

  ప్రత్యుత్తరంతొలగించు
 4. శ్రీ గారు,
  ఎంతో సంతోషమండి. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. శ్రీ గారు,
  మీ వ్యాఖ్యలు స్పామ్ లోకి ఎందుకు పోయినాయో మరి. నేను చూసి స్పామ్ కాదు అనే చోట క్లిక్ చేయంగానే రెండూ ప్రచురింపబడ్డాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. Love this really.. చాలా చాలా బాగుంది ఆ వర్ణన.మనసు దోచేసారండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 7. సుభాషిణి గారు,
  ధన్యవాదాలండి.
  ఎక్కడ?చాలారోజులతర్వాత కనిపిస్తున్నారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. అబ్బాబ్బబ్బబ్బా ! ఎంత బాగా వర్ణించారండీ! భావ వ్యక్తీకరణ అద్భుతం!
  నాకు కూడా నేర్పరూ ఇలా వ్రాయటం ...

  ప్రత్యుత్తరంతొలగించు
 9. ఊఁ...... నిజంగానా రసజ్ఞ గారు,
  అట్లయితే ఒక పని చేద్దాం. నేను రసజ్ఞ నైపోతా, మీరు నేనైపొండి.
  భలే గా ఉంటుంది. నేను రసజ్ఞనైతే.....ఆహాఁ.....
  ధన్యవాదాలండీ మీ రసజ్ఞతకు, నాపై మీ అభిమానానికి.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. జ్యోతిర్మయి గారు,
  నిజమా? చాలా సంతోషమేసింది. మీ 'చెలిమి' దొరికింది మరి.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. ఆ రమణీయతా ప్రకృతి - అంబుద బిందువు చిందు సందడిన్
  తీరుల తీరులన్ తరులు తీవలు ప్రేమల పల్లవించుటల్
  చూరలు గొన్న క్రొవ్విరులు శోభిలుటల్ మథుపాల సంతకాల్
  తారసలాడు మీదు కవితాత్మ కళాత్మక మయ్యె గొప్పగా .
  ----- సుజన-సృజన

  ప్రత్యుత్తరంతొలగించు
 12. రాజారావు గారు,
  ప్రకృతి రమణీయతను, కవిహృదయాన్ని చక్కగా వర్ణించారు.
  ధన్యవాదాలండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. భాస్కర్ గారు,
  మీక్కూడా . పండుగ బాగా జరిగిందనుకుంటాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. సుభాషిణి గారు,
  ధన్యవాదాలండి. మీక్కూడా పండుగ శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. సేంపించ్ అండి ,ఎందుకంటే...మీ టెంప్లేట్ నా టెంప్లేట్ ఒకిటే కదా:))
  మీ బ్లాగ్ చాలా బాగుంది.మీ కవితలన్నీ బాగున్నాయి .నాకూ చాలా నచ్చాయి

  ప్రత్యుత్తరంతొలగించు
 16. రాధిక గారు,
  ధన్యవాదాలండి.
  ఎంతో సంతోషపెట్టినారు.

  ప్రత్యుత్తరంతొలగించు