Loading...

11, ఆగస్టు 2012, శనివారం

కలల కొత్తలోకంలో.....


అతడు...
నీలికురులున్న నీలవేణివో
పూల తనువున్న పూబోణివీవో......
ఆమె...
గానమాధురులున్నగండుకోయిలవో,
మబ్బుగని యాడు మయూరానివో....
అతడు...
తళుకుబెళుకు తారవో,
చిలుక పలుకుల కలికివీవో....
ఆమె....
వలపులు చిందే వలరాజువో....
వనములనేలే మృగరాజువీవో......
అతడు.....
అలకలు బూనే అలివేణివో,
చిరుచిరు నగవుల విరిబోణివీవో......
ఆమె....
చల్లని చూపుల నెలరాజువో....
తలపుల మెదిలే రేరాజువీవో.....

(కొత్త కొత్త కలలను కనీ ప్రతీ కొత్త బంగారులోకపు యువరాజు, యువరాణుల తలపుల పందిరి..)

12 వ్యాఖ్యలు:

 1. లక్ష్మీదేవి గారూ!
  మీ వ్రాతలు చక్కటి గీతంలా ఉంది...:-)
  సంగీత జ్ఞానం ఉన్నవారు ట్యూన్ కట్టేస్తారేమో!..:-)
  యువరాజు..యువరాణుల కలలు బాగున్నాయి.
  @శ్రీ

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శ్రీగారు,
  నిజం!! చాలా సంతోషమండి. ధన్యవాదాలు. ఆ లేతవయసులో కనే కలలు రంగుల బంగారు కలలు కదండీ!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. పద్మార్పిత గారు,
  కాబట్టే జత కడతారు. కదండీ,ధన్యవాదాలండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఇలా యుగళ గీతాన్ని శ్రావ్యంగా మనోహరంగా ఆలపించినందుకు అభినందనలు లక్ష్మీదేవి గారు..

  ప్రత్యుత్తరంతొలగించు
 5. చాలా సంతోషం వర్మ గారు.
  మీకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. లక్ష్మి గారూ, మంచి భాష వచ్చినవారు మీరు ఎన్ని పాటలైనా రాయగలరు,
  చాలా బాగుంది పాత. ప్రేమ కనిపిస్తుంది...మెరాజ్.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండి.
  ఇంకా నేర్చుకోవాల్సింది ఉందండీ భాషలో..
  ధన్యవాదాలు.
  ప్రేమ క/అనిపించే సమయాల్లోని భావాలేనండి మఱి.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. లక్ష్మీదేవి గారూ!
  తెలుగు భాషా దినోత్సవ శుభాభినందనలు...
  @శ్రీ

  ప్రత్యుత్తరంతొలగించు
 9. శ్రీగారు,
  తెలిసిందండి. మీకు కూడా శుభాకాంక్షలు.
  అన్నట్టు మీ బ్లాగ్ తెరుస్తూనే బ్రౌజర్ క్రాష్ అయిపోతున్నదండి. ఫైర్ ఫాక్స్, క్రోమ్ రెండూ అంతే. మీరు ఆ వెన్నెల వీడియో పెట్టినాకే అనుకుంటా. అప్పుడు వ్యాఖ్య వ్రాసినా, గానీ అప్పటినుంచీ మీ బ్లాగ్ సమస్యగానే ఉంది కొంచెం చూడరూ, మీ కవిత ఇంకోసారి చదవాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. లక్మి గారూ!
  నేను ఓపెన్ చేస్తే మామూలుగా ఓపెన్ అవుతోన్దండీ!
  అందులో వైరస్ లేదు కూడా...
  శర్మ గారు కూడా ఓపెన్ కాలేదని చెప్పారు...
  ఆమధ్య వర్డ్ ప్రెస్ అన్ని పేజీలు వేరేగా ఓపెన్ అయ్యాయి..
  ఇపుడు కూడా బ్లాగ్ ఓపెన్ చేసి చూసాను...
  ఓపెన్ అయింది
  మరేమైన ప్రాబ్లం అనుకుంటా...
  మళ్ళీ అల్లా అయితే చెప్పండి...
  వీడియో తీసేసి చూస్తాను...
  @శ్రీ

  ప్రత్యుత్తరంతొలగించు
 11. శ్రీనివాస్ గారు,
  నేను ఇప్పుడు ఈ వ్యాఖ్య ప్రచురించాక మళ్ళీ మీ బ్లాగ్ కెళ్ళి చూస్తాను. వస్తే అక్కడ వ్యాఖ్య వ్రాస్తాను.ఎందుకంటే మళ్ళీ బ్రౌజర్ క్లోజ్ అవుతుంది.
  ధన్యవాదాలండి.

  ప్రత్యుత్తరంతొలగించు