Loading...

28, జులై 2012, శనివారం

వెదురునై, వేణువునై

చినుకు రాలి భువిని చేరు లోపలే
మదిలోపల చిత్తరువై నిలిచి పోయింది.
చిగురు కొఱికి  పదము పాడు కోయిలే
వగలు పోతూ స్వరములు నాలో చేర్చింది.
కలల్లోని కవ్వింతలన్నీ కవితలై
కన్నుల్లో కాంక్షలై వన్నెకెక్కాయి.
వేచి వేచి వేసారిన గోపిక నేనై
వేణుధరుని అధరముపై చేరేందుకు
వెదురు మొక్కగా మొలకెత్తాలనుంది.

6 వ్యాఖ్యలు:

 1. శ్రీకృష్ణుని అధరం చేరాలని వెదురుగా పుట్టడం...
  చాలా చక్కని భావం లక్ష్మి గారూ!
  అభినందనలు..
  @శ్రీ

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఎంత చక్కగా రాశారో, అభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నిజం శ్రీ గారు,
  మనిషిగా పుట్టేకన్నా మానై పుట్టడం మేలంటారు.
  అలాగే వెలది గా పుట్టేకన్నా వెదురుగా పుట్టి వేణువునైతే, ఆ వేల్పు వేలి కొసల స్పర్శతో జన్మ ధన్యం కాదా!
  మీ స్పందనకు ధన్యవాదాలండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. భాస్కర్ గారు,
  మీ స్పందనకు చాలా సంతోషమండి. ధన్యవాదాలు.
  మీరైతే చెట్టు పేరే పెట్టేసుకున్నారుగా ఎంచక్కా!!

  ప్రత్యుత్తరంతొలగించు
 5. చాలా చాలా చక్కని భావం లక్షీదేవి గారు... బాగుంది..

  ప్రత్యుత్తరంతొలగించు
 6. సాయి గారు,
  మీరు గమనించారా, మీరు ప్రతిసారీ లక్షీదేవి అని వ్రాస్తారు. లక్ష్మీదేవి అని వ్రాయాలండి.
  ధన్యవాదాలండి

  ప్రత్యుత్తరంతొలగించు