Loading...

10, జులై 2012, మంగళవారం

ఆ లోచనాల వెనుక.....


సమాజపు చేలో
మనిషి అనే భూకమతపు
మట్టిబుఱ్ఱలో
ఆ లోచనాల వెనుక
ఆలోచనల పంట !

రాగద్వేషాల
విత్తు జల్లేవారంతా,
వచ్చీపోతుండే
బంధాలే కదా మఱి!
నిరంతరమూ జరిగే
సేద్యమిది , ఆగదెన్నడూ!

వాన కురిసినాకే
పొలంలో పంట !
ఆలోచనల పంట
పండినాకే, కళ్ళమబ్బుల
కన్నీటివాన !

పొలంలో పంట
పండితే కరువుండదు.
.........
ఎన్ని కరువులొచ్చినా
ఈ పంటకు కొదువలేదు.

6 వ్యాఖ్యలు:

  1. పోలిక బాగుందండీ. పంట చేనుగా చూడబట్టే, పక్కనున్న వ్యవసాయదారుల తాకిడి (సామాజిక వత్తిడి) పడుతుందేమో మనిషి ఆలోచనా రీతిపైన? ఫలసాయం అంతా కన్నీటి పంటే అంటారా అయితే? అదే, ఒక పళ్ళ తోటగా భావిస్తే తన సాగు, పంట తనదేగా. ఏమో - సమాజపు ప్రభావం ఎక్కువగా చెడుకి, బలహీనతకే కారణమౌతుంది కానీ నేనున్న వాడకట్టు, పరిసరాలు నన్నిలా తీర్చిదిద్దాయి అనే నినాదం, నిజావాక్కు చాలా అరుదుగా వినవస్తుంది.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ట్రీ గారు,
    మీకు నచ్చినందుకు సంతోషమండి.ధన్యవాదాలు.

    ప్రత్యుత్తరంతొలగించు
  3. ఉషగారు,
    మీ ఆలోచనలు మరింత లోతైనవి.
    కానీ ప్రతిపంటకీ విత్తులు జల్లడం లాంటివే నీరు, గాలి, పురుగు, పుట్రా , అనుబంధాలై చేసే కీడు, మేలు.
    ఇది మూడునెలల్లో వచ్చే పంటకీ, ఒక్కసారి నాటితే ప్రతిసారీ పంటనిచ్చే తోటకీ కూడా వర్తిస్తుంది.
    చెడు మాత్రమే కాదు, చుట్టూ ఉన్న మంచి కూడా మనిషిని, మనసుని ప్రభావితం చేస్తుంది.
    కన్నీళ్ళూ సంతోషానికీ, బాధకీ కూడా ఊరతాయి.
    బయటి ప్రభావం అదెలాంటి దైనా మనిషిమీద ఉండక తప్పదు. అది లేకుండా ఉండటం అసాధ్యం.ఉన్నాననటం హాస్యాస్పదం.
    తనదైన సిద్ధాంతాలతో ఉన్నవారైనా, ఒక్క సారి నాటిన తోటలాగా, మళ్ళీ విత్తులు, జల్లుల అవసరం లేకపోయినా, గాలి, భూమి, కీటకాల ప్రమేయం లేకుండా ఉండటం జరగదు కదా?
    ధన్యవాదాలండి. చాలా సంతోషం కలిగింది మీ వ్యాఖ్య చూసి

    ప్రత్యుత్తరంతొలగించు
  4. లక్ష్మి గారూ!
    కొత్త కోణం ..చాలా బాగుంది...
    మీరన్నండి నిజమే...:-)
    కానీ
    విత్తులు ఎవరేవి చల్లినా సారవంతమైన మట్టి అయితే..
    అదే సదాలోచనల సారం మన బుర్ర అయితే...
    చెడును పొల్లుగింజలుగా,
    మంచిని శుద్ధి చేసిన విత్తనాలుగా భావిస్తే..
    ఫలసాయం అవదా సఫలం? ఏమంటారు?
    @శ్రీ

    ప్రత్యుత్తరంతొలగించు
  5. తప్పకుండా అవుతుంది. శ్రీగారు!
    కానీ కలలు కొన్నిసార్లే నిజమవుతాయి. మీరు చెప్పింది మంచికలలా ఉంది. నిజం చేదుగానే ఉంటుంది. జీవితం పాఠాలు నేర్పే కొద్దీ చాలా విషయాలు అర్థం అవుతాయి.

    ప్రత్యుత్తరంతొలగించు