Loading...

19, జూన్ 2012, మంగళవారం

జలవారధి (నీటివంతెన)చలిగాలుల సందేశాన్ని పంపి తన రాకను
తెలుపుతున్న వారెవ్వరే సఖీ!

అలనాడొక రాతివంతెన నీటిపై కట్టినట్టుగా.....
కలకంటున్న భువనానికి గగనసీమలనుంచీ
ఇలఁ జేరువరకూ  జలవారధి గాలిలో కట్టేవారెవ్వరే సఖీ!
ఋతురాగము ననురాగముగా ఆలపిస్తున్న దెవ్వరే సఖీ!

తొలి చినుకుల చూపులతో భూదేవిని
పులకింపఁజేస్తున్నదెవ్వరే సఖీ!

పలువన్నెలతో సింగారపు బొమ్మవలె
ఫలపుష్పాదులతో , పచ్చదనాలతో
అలంకరిస్తున్నదెవ్వరే సఖీ!

8 వ్యాఖ్యలు:

 1. భలే అందమైన ఊహ! చాలా బావుందండీ.. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మధురమైన వాణి గలిగిన మధురవాణిగారు,
  ధన్యవాదాలండి. మీకు నచ్చింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. చాలా బాగుంది లక్ష్మీదేవి గారూ!
  @శ్రీ

  ప్రత్యుత్తరంతొలగించు
 4. చాలా బాగుంది లక్ష్మీ గారు...

  తొలకరి చినుకు పడగానే వచ్చే మట్టి సుహాసన

  ఏ పువ్వుల సుహాసనతో పోల్చగలం చెప్పండి...

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఔనండి.
  తొలకరి జల్లులు పడినపుడు ఆహ్వానపూర్వకంగా మట్టి వెదజల్లే సువాసనల్ని ఇంక దేన్తోనూ పోల్చలేం.
  మట్టి సహజగుణం గంధము అంటారు కదా.
  ధన్యవాదాలు మీ భావాల్ని పంచుకున్నందుకు. నా రాతల్ని మెచ్చినందుకు.

  ప్రత్యుత్తరంతొలగించు