Loading...

4, జూన్ 2012, సోమవారం

తొలకరి చినుకులకై


తొలకరి చినుకులకై పలువురి ఊహలు
కలలుగ కనబడుతూ అలరిస్తున్నవి

అలలుగ యెగసిన ఆశలు కడలిని
అలవోకగ మీఱుచు ముచ్చటగా
తలపుల హద్దులు దాటుతున్నవి

ఫలమును ఇచ్చుట తథ్యమని
బలముగ తోచెను మనములలో

మలమల మాడ్చిన ఎండలను
విలవిల లాడిన వేసవి తోడుగ
కలిపి పంపెదమింకను సంబరమే!

9 వ్యాఖ్యలు:

 1. ఇంకా ఎదురుచూస్తున్నామండీ!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అదేనండీ, ఎదురుచూపుల్లో కన్న కలలన్నమాట.
  ధన్యవాదాలండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. కార్తెల గురించి వ్రాస్తానన్నారు కదా, ఎప్పుడు వ్రాయబోతున్నారండీ? పంచాంగంలో కొన్ని వివరాలున్నాయి. ఒక నవలలో కొన్ని వివరాలు తెలిశాయి. మీరు వ్రాయండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. బాగుందండీ! ఇది చదువుతుంటే అప్రయత్నంగా చినుకై వరదై సెలయేటి తరగై అన్న పాట పెదవి దాటింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. రసజ్ఞ గారు,
  ఏవో ఊహలు, ఎన్నో భావాలు చెప్పాలని ఉన్నా అందంగా చెప్పలేక, చెప్పకుండ ఉండలేకున్న నా మది లోతుని గ్రహించిన మీకు ధన్యవాదాలండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. చక్కని పదాల ఒద్దికైన అల్లిక...
  బాగుంది లక్ష్మి గారూ!
  @శ్రీ

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మీకు నా రచన నచ్చినందుకు చాలా సంతోషమండీ, ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు