Loading...

24, మే 2012, గురువారం

ఆనందంఅన్నీ మన మంచికే అంటుంటారు, కానీ ఒక్కోసారి కోపం ఆగదు, ఎందుకిలా జరగాలి అని ఆందోళన పడిపోతుంటాం. అవతలి వాళ్ళ మీద విరుచుకు పడిపోతుంటాము.
            అంతెందుకు? పవర్ కట్ అయినపుడల్లా ఎంత కోపంవస్తుందో, ఈ విద్యుత్తే లేనప్పుడు మనుషులు లేరా ఏం? అసలు ఇప్పుడు కూడా నగరాల్లో కన్నా పల్లెల్లో ఎక్కువ సేపు ఈ కోతలుంటాయి కదా, వాళ్ళెలా ఉంటారు? అన్నీ తెలిసినా కూడా, ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నా కూడా కోపంవస్తుంది.
             అసలు నిరంతరాయంగా విద్యుత్సరఫరా ఉంటే బాగుంటుంది అనీ అనిపిస్తుంది. కొన్ని రోజులు అలవాటయితే కోపం తగ్గుతుంది. రాత్రి పూట విద్యుత్కోత సమయంలో మిద్దెమీద నిద్దుర పోవటం లో ఉన్న ఆనందం ఏమిటో తెలుస్తుంది. ఎంత త్వరగా నిద్రపట్టేస్తుందో, సూర్యోదయం అయ్యీ కాక ముందే అలారమ్/ ఫోన్ లేకుండానే ఎలా మెలకువ వస్తుందో తెలుస్తుంది.
                   నదిలో స్నానం చేస్తే సబ్బులు, షాంపూలు గోల లేకుండా చక్కగా నెచ్చెలులతో కలిసి గంటలు గంటలు నీళ్ళలో జలకాలాడుతుంటే అది ఎవరికి వారికే అర్థమయ్యే ఒక ఆనందం. అలా స్నానం చేశాక ఎంత ఆకలి వేస్తుందో అది కొత్తగా ఉంటుంది.   రాత్రి ఎంత ప్రశాంతంగా గాఢనిద్ర పడుతుందో అదంతా మనం ప్రకృతి నుంచి ఎంత దూరం వచ్చేశామో తెలుపుతుంది. ఈ మధ్యలో ఒక పల్లెకు , ఒక నది ఉన్న క్షేత్రానికి ఫంక్షన్ లకు వెళ్ళి కొన్ని రోజులు ఉండటం మూలంగా మనసులో మెదిలిన భావాలు.

6 వ్యాఖ్యలు:

 1. చక్కని అనుభూతి! మీ ఈ టపాతో ఒకసారి అలా మా ఊరు తీసుకుని వెళ్లారండీ! ఇప్పటికీ మాకు వేసవి కాలం వస్తే పక్కలు డాబా మీదే!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. రసజ్ఞ గారు,
  ధన్యవాదాలండి. మీరీ మధ్యలో రెండు మూడు పోస్ట్ లు రాసేశారు. నేను ఊర్నించి వచ్చాక ఇంకా చదువుతున్నా. ఈలోపు మీ బ్లాగ్లో ఒకరి వ్యాఖ్యలు చూసి కోపం వచ్చి ఏదన్నా అందామని వస్తే మన మిత్రులందరూ ఆ వ్యక్తి కి బుద్ధి చెప్పారని తెలిసి ఇంక ఊరుకున్నాను. నేనయితే అంత కూడ అనలేను. ఇంత గట్టివారు మన మిత్రులుండగా ఇంకేం అని.:))

  ప్రత్యుత్తరంతొలగించు
 3. పైరు పచ్చలు గల పచ్చల హారమ్ము
  యేటి చెలిమ నీటి సాటి యేది ?
  గాలి నీరు స్వఛ్ఛమై ,లలితమయి - మా
  పల్లెటూరు సతత భాగ్య సీమ .

  బ్లాగు సుజన-సృజన

  ప్రత్యుత్తరంతొలగించు
 4. రాజారావు గారు,
  నమస్కారమండి.
  మీ స్పందనకు ధన్యవాదములు.
  ప్రతి బ్లాగులోను మీ పద్యరూప స్పందన గమనిస్తున్నాను. పల్లె గాలి లాగా స్వచ్ఛమైన మీ పద్యాలు శంకరాభరణంలో కన్పించకపోవటం లోటు గా నున్నది.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. నిజమే అండి...
  చిన్నప్పుడు ఉరి బావుల్లో ఈతలు...
  పిల్లకాలువలో కేరింతలు...
  ఎండాకాలం వస్తే వేపకయలతో ఆటలు...
  తుమ్మబంక ఇస్తే బెల్లం ఇస్తారు అని బంక కోసం చేలలో నాన కష్టాలు..
  చింత చెట్లకింద సీసంగోలి ఆటలు...
  రాత్రి అయితే మిణుగురు పురుగు పట్టుకోవటానికి ఉరు బయటకు వెళ్ళటం...
  ఆ రోజులు మళ్ళి రావు అండి...
  మీ ఆనందముతో మళ్ళి మా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తు చేశారు ధన్యవాదములు అండి

  ప్రత్యుత్తరంతొలగించు
 6. అమ్మో , మీరు చాలా సాహసకృత్యాలు చేసి చక్కటి జ్ఞాపకాలు మిగిల్చుకున్నారే, మాకంత దృశ్యం లేదులెండి. రాణివాసపు బిడ్డలాగా (ఆస్తులన్నీ కరిగి పోయినా) పెరిగాము. ఐనా ఏ విషయం తల్చుకున్నా మనసు ఆనందంతో నిండిపోతుంది.
  మీ ఆనందం పంచుకున్నందుకు ధన్యవాదాలండి.

  ప్రత్యుత్తరంతొలగించు