Loading...

5, మే 2012, శనివారం

సమీరమా!
చెలికాని ఊపిరులతో ఎదనింపే పవనమా!
మనసైన ఊసులనే తలపులలో నింపుమా!

కనరాని దూరాల పయనించే సమీరమా!
కనిపించని దూరాలను కరిగించుట సాధ్యమా!

ఒడలెల్లా పులకరముల కురిపించే నేస్తమా!
సడి చేయని రాగాలను వినిపించెదనాగుమా!

కడు మెల్లని నడకలిక చాలించరాదొకో!
వడివడిగా చనుదెంచి అందించ రాదొకో!

సందేశము చేర్చినచో కానుకగా కలలనే
దారులలో పువ్వులుగా పఱచెదనే మారుతమా!

4 వ్యాఖ్యలు:

  1. సమీరాన్ని కవితా వస్తువుగా వాడటం అందంగా వుంటుంది.దాన్ని చక్కగా వ్రాశారు.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ధన్యవాదాలండి,మీకు నచ్చినందుకు సంతోషం.

    ప్రత్యుత్తరంతొలగించు