Loading...

30, ఏప్రిల్ 2012, సోమవారం

ల్లల్లల్లల్ల ల్లల్లల్లా..........


గొల్లవారి ఊరిలోన
మల్లెపూల తోటలోన
వెల్లి విరిసె వెన్నెల

మెల్లమెల్ల ఊయల
మళ్ళిమళ్ళి ఊగుచు

అల్లి బిల్లి ఊసుల
పిల్లగాలి పాటల

చల్లచిలుకు గోపెమ్మ
కల్లలాడు గోపయ్య

నల్లనయ్య నవ్వులా....
పొల్లుపోని పలుకులా.....

ఝల్లుమనెడు గుండెలో
పల్లవించు వలపులు....................

8 వ్యాఖ్యలు:

 1. బాగుందండి ఈ పాట. గోకులంలో వినిపిస్తున్న పాటలా.....

  ప్రత్యుత్తరంతొలగించు
 2. బాగుందండీ!
  గోకులంలో క్రిష్ణయ్య పాట....
  @శ్రీ

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ప్రిన్స్ గారు,
  ధన్యవాదాలండి. సంతోషం.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. చాలా బాగుంది! ఇది చదువుతుంటే దృశ్యం కళ్ళ ముందు ఉన్నట్టుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. రసజ్ఞ గారు, ధన్యవాదాలండి.
  గోకులాన్ని ఇలా అప్పుడప్పుడైనా తలచుకోకుండా ఉండలేము.

  ప్రత్యుత్తరంతొలగించు