Loading...

9, జనవరి 2012, సోమవారం

ఘంటసాల గారి స్వీయ రచనలు
ఆంధ్రుల అభిమాన గాయకులు శ్రీ ఘంటసాల గారు విదేశయాత్రనుంచి దిగ్విజయముగా తిరిగి వచ్చిన సందర్భములో ప్రచురింపబడిన భువనవిజయము అనే పుస్తకములో నవంబర్ 1971 లో ముద్రితమైనవి.

బాటసారీ!
మృతి అంటే భయం లేని వ్యక్తి పాడుతున్న పాట.

బహుదూరపు బాటసారీ
యిటురావో ఒక్కసారీ      ||బ||
అర్థరాత్రి పయనమేల నోయి
పెనుతుఫాను రేగనున్నదోయి
నా కుటీరమిదేనోయ్
విశ్రమింపరావోయి
వేకువనే పోదమోయి    ||బ||
పయనమెచటికోయ్ నీ
దేశమేనటోయి
నా ఆశలు తీరెనోయి
నీతోగొనిపోవోయి     ||బ||
***************************************************
౨.నారాణి
మరువలేనె మరువలేనె
నా వలపుల రాణి
తరుణమేదో యున్నదంచు
తెలిపి నావె నారాణి           ||మ||
పండు వెన్నెల నాటి రేయి
యేమేమొ పల్కి నావే
నాటిమాటలు నేడేమాయె  ||మ||
నారాణిని నీ రాజును
వేరు సేయు వారు లేరని
పల్కిన పల్కులు ఏమగునో  ||మ||
+++++++++++++++++++++++++++++++++++++++++++++
౩. ఓ సఖీ
మరణసమయ మిదియే ఓ సఖీ
వలపు మరిచిపోకే    ||మ||
వలపు తలపులు
అలలు అలలుగా
పయనించెనే నీ రూపురేఖయే
మైమరిపించెనే నీ తేనె మాటలూ
ఇలలో కలలాయె
జగము వెగటాయె  ||మ||
ఇహములోన మన
వలపు కలయైన
పరములోన  మన
మేకమౌదామను
మాట తెలుపరావే
కడసారి చూచి పోవే     || మ||
--------------------------------------
౪.ఎన్నినాళ్ళు!
ఎన్నినాళ్ళు గడిచినాయో
చిన్ని పాప నను బాసీ  ||ఎన్ని||
కనుపాప నాపాప
ననుజూచి నవ్వినాడె
కన్నులార జూచే లోనె
కన్నుమూసె చిన్నిపాప    || ఎన్ని||
మనసుదీర పాప మోము
ముద్దులాడలేనే లేదె
ముద్దులొలుకు నా బాబు
ముద్దు తీరనైనా లేదే   || ఎన్ని||
0000000000000000000000000000000000000000000000000
౫.మరపురానిది
మరపురాని తీయనైన బాధా
రోజ రాజుల గాథా ||మరపు||
వలపు టలల తలచి కులికె
కన్నె యెడద పులకరింత   ||మరపు||
మొగము మొగమె యెరగకున్న
యెరిగి యెరిగి వలవకున్న
వలచి చేరి వీడకున్న
మురిసి మురిసి తుదకిటులై
ముగియదేమొ నా బ్రతుకు     || మరపు||
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
౬.జీవితనౌక
సూటిగ పోయె జీవిత నౌక
దారి తప్పినది విధి సరిలేక
మల్లి మనసులో వలపు రేగెను
వలపు రేగి తా వరుని చేరెను
వరుని చేరి తా వలపు తెలిపెను
వరుని కౌగిట ఒదిగి పోయెను  || సూటిగ||
మగని మనసు తెలియని మల్లి చివరకు ____
తీరని కోరిక కోరిన దాని
వరుని కోపమున మరిగిపోయేను
మల్లి మనసులో మంట రగిలెను
మంటరేగి తా కుమిలి పోయేను
మల్లి జీవితమె కథగ మారెను    ||సూటిగ||
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
౭. భూమి పొమ్మన్నది ____ఆ
కాశం రమ్మన్నది          || భూమి||
అక్కడ నీ వారున్నారన్నది
ఆ దరికే నిను చేరమన్నదీ
కామక్రోధముల కాల్చమన్నది
లోభమోహముల త్రెంచమన్నది
మద మత్సరముల వదలమన్నది
ఇహమున అంతా శూన్యమన్నది
పరమే శాంతికి నిలయమన్నది      ||భూమి||
సంసారమనే సాగరమందు
సంగీతమనే పూల నావపై
సరిగమ పదనిస అంచులు దాటి
సర్వేశ్వరునే తలచమన్నది
సుఖముగ స్వర్గము చేరమన్నది     ||భూమి||

నాకు విషయం తెలిపి ప్రోత్సహించిన రసజ్ఞ గారికి ధన్యవాదాలు. ఈ వివరం నాతో పంచుకున్న మాధురిగారికి కృతజ్ఞతలు.

11 వ్యాఖ్యలు:

 1. వావ్ మందాకిని గారూ! మీ టపాలో నా పేరు చూసి చాలా ఆనందంగా ఉంది! బహుదూరపు బాటసారీ ఇటు రావోయి ఒక్కసారి అన్న పాట కూడా ఈయన వ్రాసినదే అండీ కుదిరితే చేర్చండి! మాధురి గారికి నా తరఫున కూడా కృతజ్ఞతలు!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. రసజ్ఞ గారు,
  ఆ పాటే మొదట్లో పెట్టాను కదండీ, మరీ తొందరపడి చదవకుండానే వ్యాఖ్య పెట్టినట్టున్నారు. సంతోషమండీ, ధన్యవాదాలు. నిజానికి మాధురిగారు ఇవి నాకెప్పుడో ఇచ్చారు. నేనే సమయాభావం వల్ల అన్నీ చదవలేకపోయాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. vaalukanula polisenkatasaami ninu nenu maruvalenuraa....raasindi evaro telusaa

  ప్రత్యుత్తరంతొలగించు
 4. తొలకరి గారు,
  http://en.wikipedia.org/wiki/Mana_Desam
  ఈ లింక్ ప్రకారం మనదేశం సినిమాలో పాటల రచయిత సముద్రాల రాఘవాచార్య అని ఉంది. మరి.
  పొన్నకాయ వంటి పోలీసెంకటసామి, నరసమ్మా నిను నేను మరువలేను ఈ పాట మొన్నీమధ్య టీవీలో చూశాను. సరదాగా ఉండింది.
  ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. బాటసారీ అన్న టైటిల్ చూసాను కాని నిజమే పాట పూర్తిగా గమనించలేదు! ఎదయితేనేమి మన అభిమాన ఘంటసాల గారి రచనలు వెలుగులోకి వచ్చాయి!

  ప్రత్యుత్తరంతొలగించు
 6. రసజ్ఞ గారు,
  అదేనండీ, నాలా తెలియని వాళ్ళకు తెలుస్తుందనే ఒకే ఉద్దేశ్యంతో టైప్ చేసి ప్రచురించాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. mandakini garu, rasagna garu,

  many many thanks, it was only a forward mail.

  madhuri.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. మరొక్క మంచి పాట ...
  ” స్వాతంత్ర్యమె మా జన్మ హక్కని చాటండీ -
  నిరంకుశంబగు శక్తులెదిరిన నిర్భయముగ నెదురించండీ -
  పరుల దాస్యమున బాధలు పొంది బ్రదికిన చచ్చిన భేదమె లేదు - ” కూడా ఘంటసాల వారిదే!

  ప్రత్యుత్తరంతొలగించు
 9. ఆచార్యుల వారికి నమస్కారములు.
  నా దగ్గర ఆ పాట లేదండి. మంచి పాట. లింక్ ఇవ్వగలరా ఏదైనా?

  ప్రత్యుత్తరంతొలగించు