Loading...

9, నవంబర్ 2011, బుధవారం

పున్నమి వెన్నెల                                 చక్కని శరదృతువు. ఈ ఋతువులొ వచ్చే రాత్రులని కవులు శారదరాత్రులని వర్ణిస్తూఉంటారు. చల్లని , తెల్లని వెన్నెల పున్నమి రోజు పూర్తిగా పెద్దగా విరబూసిన చంద్రసుమం కురిపించే కౌముది సుధలు. చంద్రుని నుంచి నిరంతరం అమృతం స్రవిస్తుందని భావుకులు అంటారు. సుధాకరుడనే పేరు కూడా చంద్రునిదేగా!సుధ అంటే అమృతం.

                       అబ్బ , చంద్రుని వెన్నెల కు ఎన్ని పేర్లున్నాయో కదా! మనమంతా అలవాటుగా పిలిచే వెన్నెల అనేపేరుతో బాటు, వెన్నెల, కౌముది, జ్యోత్స్న, చంద్రిమ, చంద్రిక  అన్నీ అందమైన పేర్లే.

                      ఇక ఈ వెన్నెలను మన బ్లాగర్లు ఎలా వదిలి పెడతారు. అందమైన వెన్నెల పేర్లు తమ బ్లాగులకు పెట్టేసుకున్నారు.

             ఈ పేర్లన్నీ చూద్దామా. (నాకు తెలిసినవి మాత్రమే, ఇంకా కొన్ని బ్లాగులు ఉండవచ్చు. వారు కూడా తమ పేర్లు చెప్పరూ !)

                             వెన్నెల, ఎన్నెల, వెన్నెల సంతకం, వెన్నెల్లో   గోదావరి   , చంద్రిమ, చందమామ చరిత్ర , చందు -నేనింతే. ఇంతే ..

అమ్మాయిలకు వెన్నెల పేర్లన్నీ సరిపోతాయి కదూ, జాబిలి పేర్లన్నీ అబ్బాయిలకు.

        చంద్రుడు వెన్నెల విడిపోనట్లు ప్రేమ ఉన్న ప్రేమికులు, దంపతులు విడిపోరు.
ఒక పాత పాట కూడా ఉంది సుమా- "వెన్నెలలెంతగ విరిసినగాని జాబిలిని విడిపోలేవులే...."

                               ఈరోజు ప్రయాణం ఉంది. వెన్నెల ను మిస్ అవుతున్నానే అనుకున్నాను కానీ ట్రైన్ లో వెళుతూ, అడవిలో గాచిన వెన్నెల ని చూడటం కూడా బాగుంటుందిగా అని తర్వాత అనిపించింది. తప్పకుండా చూస్తాను. చందమామతో మాట్లాడుకుంటాను హాయిగా...చల్లగా....

        పైన  వెన్నెలతో పాటు తారల్లా క్రింద భూమి మీద చక్కని చుక్కల్లాంటి అమ్మాయిలు నీటిలో కార్తీక దీపాల చుక్కలనూ ఈ వేళ  వెలిగిస్తారు. ఆ అందం చూడాల్సిందే.

8, నవంబర్ 2011, మంగళవారం

కొత్త సమస్యలు


                        బ్లాగ్ లో కొత్త సమస్యలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఎప్పుడూ ఏదో ఒకటి మాయమవుతూనే ఉంటుంది. ప్రస్తుతం నా వంట బ్లాగులో వ్యాఖ్య ఫారమ్ కానీ, ౦ వ్యాఖ్యలు అనే పదం కానీ కనిపించటం లేదు. పాత పోస్ట్ లో కొన్ని వచ్చిన వ్యాఖ్యలు కూడా మాయమయ్యాయి.

       సెట్టింగ్స్ లో కెళ్ళి వ్యాఖ్యలు చూపించు/దాచిపెట్టు లో చూపించు మళ్ళీ సెట్ చేసి, టెంప్లేట్ మొత్తంగా మార్చి  ఏం చేసినా మొరాయిస్తోంది.

                                 అయితే అదే బ్లాగులో కొన్ని టపాలకు ఈ సమస్య లేదు. ఈ రోజు రాసిన టపాకు , కొన్ని పాత టపాలకు ఈ సమస్య.

          మళ్ళీ ఇదే టెంప్లేట్ తో ఉన్న నా మరో బ్లాగ్ కు ఈ సమస్య లేదు. ఏంటో బ్లాగులు, ఈ మిథ్యాభిమానాలు, వీటి కోసం వెంపర్లాటలూ  వదిలేదెప్పుడో!


మిత్రులు తెలిసిన వాళ్ళెవరైనా కొద్దిగా సలహా ఇవ్వరూ!
అబ్బే మాకిదే పని మరి అంటారా? :-))