Loading...

15, అక్టోబర్ 2011, శనివారం

తెలుగు వాళ్ళం



తెలుగు వాళ్ళందరూ అందరి దృష్టిలో బాగా చులకన అయ్యారు. ఇంతగా వీరావేశం తో ఒకరినొకరు దూషించుకుంటున్న తెలుగు జాతి ఏమవబోతుంది? ఈ అగ్ని మొదలవగానే చల్లార్చకుండా ఆజ్యం పోసిన ప్రబుద్ధులెవ్వరు? అందరికీ అన్నీ తెల్సు. తెల్సినా రేగుతున్న ద్వేష జ్వాలల కీలలు ఏ మొదళ్ళను కాల్చేస్తాయో? ఏ చిగుర్లను మాడ్చేస్తాయో? అసలేమన్నా మిగులుతుందా? మిగలాలంటే దీన్ని ఆర్పేదెలా? ఎవరు ఏం చేయగలం? మనందరికీ అవతలి వాళ్ళ తప్పులే కనిపిస్తాయి. మన తప్పులు కనపడవు. ఒకరి నొకరు తిట్టుకుంటూ ఎంతకాలం ఇది రగులుతుంది?ఎప్పుడు శాంతి? ఎందుకు విడిపోవటం? విడిపోయి ఏం సాధించటం జరగబోతుంది? పంతం నెగ్గటం తప్ప. మిగతా భారతీయుల దృష్టిలో నవ్వుల పాలవటం మాత్రం జరుగుతుంది. ఇది హక్కుల పోరాటం కాదు. ఎందుకంటే ఇంతకన్నా కొత్త హక్కులు ఏం వస్తాయి? ఇదివరకు లేని విషయాలు ఏం జరుగుతాయి?ఏమీ ఉండదు. రోజూ ఉన్నట్టే జీవితాలు తెల్లవారుతాయి. కూచున్న కొమ్మను నరుక్కుని విడిపోతాం అనటం ఎంత తెలివైన పనో ఎవరికీ తెలియదా?