కనుఱెప్పల లోగిలిలోని తడికి కరిగిపోయే స్వప్నాలవి
సాక్షాత్కారమయ్యేనా ఎప్పుడైనా సత్యాలుగా !
రేయంతా పువ్వులపై నిలిచిన తుషారబిందువులు
తొలికిరణపు తాకిడికి తట్టుకుని నిలిచేనా ముత్యాలుగా !
అందమైనవి, ఆనందపఱిచేవి
అన్నీ క్షణికాలేనా?
అపురూపమైన ఆ క్షణకాలపు మాధుర్యాలను నీ పాదాల చెంత నివేదనగా అర్పించే భాగ్యం ఉందా ప్రభూ!
అంత గొప్ప సంతోషం నాకెదురవుతుందా!
ఒక్క క్షణం .....అరవిరిసిన నీ చిఱునగవులో నేనా స్వర్గధామాల సంతోషశిఖరాల్ని అందుకోగలనా !

15 వ్యాఖ్యలు:
చాలా బాగుందండీ..
సుభా, మీకు నచ్చినందుకు సంతోషమండీ.
చాల బావుంది మందాకినీ.! భావం,
పద ప్రయోగము కూడా బావుంది
అరవింద గారు,
మహదానందం.
మీ భావము, కవనము రెండూ చాలా బాగున్నాయి! అందమైనవి, ఆనందపఱిచేవి
అన్నీ క్షణికాలేనా? కాదేమో! మన ఆలోచనలలో నిరంతరమూ ఉంటాయి! అంత గొప్ప సంతోషం నాకెదురవుతుందా!తప్పకుండా మందాకిని గారూ!
రసజ్ఞ గారు,
తప్పకుండా ఎదురవుతుందన్నందుకు మీకు బోల్డన్ని ధన్యవాదాలు.
ఒక శాశ్వతమయిన సత్యం ముందు మనం చూసే, ఊహించే, కలలుగనేవన్నీ క్షణికాలే అంటారండీ. కానీ ఆ అనుభూతి చెందేంత పరిపక్వత ఇంకా రాలేదు మరి.
చాలా అందంగా రాసారండీ.. నాకైతే కృష్ణుడు కనిపించాడు! :)
చాలా బావుంది..
మధురవాణి గారు,
చాలా ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరి మనసులోని మకరందాన్ని వెన్నరూపంలో (ఇచ్చినా , ఇవ్వకుంటే దొంగిలించి మరీ) స్వీకరించి సంతోషపెట్టే నాథుడు కృష్ణుడే కదండీ మరి.
జ్యోతిర్మయి గారు,
చాలా సంతోషమండి.
రేయంతా పువ్వులపై నిలిచిన తుషారబిందువులు
తొలికిరణపు తాకిడికి తట్టుకుని నిలిచేనా ముత్యాలుగా !
ఎంత అందంగా ఉంది ఈ భావన
శైలబాల గారు,
కదండీ, నాకూ ఈ విషయం మీద ఇంకా ఏదో రాయాలని అనిపిస్తోంది.
ధన్యవాదాలండీ.
mandakini gaaru, chaalaa chakkati bhavana
mandakini gaaru, chaala chakkati bhavana
సాహితిగారు,
ధన్యవాదాలండి. మంచి భావాలని మెచ్చే మీరు తప్పకుండా బాగా రాస్తారు. మీరూ రాయండి మరి. మేం చదువుతాం.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి