Loading...

శుక్రవారం 25 నవంబర్ 2011

తెల్లని మబ్బుల అందాలేవో !!


చల్లని గాలి తాకిడికి
 మెలమెల్లగ కదిలే
తెల్లని మబ్బుల అందాలేవో
ఉల్లము ఝల్లనిపించగను
మరుమల్లెలు తలదాల్చిన
పిల్లది కల్లలు
కపటములెఱుగనిది
జల్లులనే "విరిజల్లు"లని
"చెఱకువిల్లును బట్టినవాని
పూలశరముల"ని
మదినెంచెనదో,
కొల్లలగు కోరికలల్లుకొనగా,
ఎద "పల్లవి" పాడెనదో!
అల్లరిగా ప్రియవల్లరిగా,
ఎల్లెడలది విహరించెనదో!



                         -మందాకిని

12 వ్యాఖ్యలు:

విరిసిన అరవిందం చెప్పారు...

అల్లంత దూరాన మురళీలోలుని పిల్లనగ్రోవి ని విని
ఒడలను కనుల గ చేసి చూడసాగెను ఆ లలనామణి!!

మీ ద్వార నాకు కూడా కవిత సౌరభం అంటుతోంది మందాకినీ(పారిజాతం)

జ్యోతిర్మయి చెప్పారు...

"జల్లులనే "విరిజల్లు"లని
"చెఱకువిల్లును బట్టినవాని
పూలశరముల"ని" చాలా బావుంది.

మందాకిని చెప్పారు...

అరవిందా , ధన్యవాదాలు.
ఏదో అంతా మీ అభిమానం. :)

మందాకిని చెప్పారు...

జ్యోతిర్మయీ,
ధన్యవాదాలండి. అందరినీ అలరించే వాడే కదా వాడు.

మందాకిని చెప్పారు...

అరవిందా , భలే చెప్పారే. అయితే లలనామణి తనువెల్లా కనులతో పిల్లనగ్రోవిలా తయారైందన్నమాట. సూపర్.

subha చెప్పారు...

మరుమల్లెలు తలదాల్చిన పిల్లది
పిల్ల తెమ్మెర తెచ్చిన కబురుల్లు
మనమున పల్లవించగా
తెలతెల్లని మందహాసము అధరమున వెల్లివిరిసినది!!
చాలా బాగుందండీ మీ భావన.మీ భావన అంత అందంగా లేకున్నా మీ కవితకు నా వ్యాఖ్య అందుకోండి.

మందాకిని చెప్పారు...

సుభా, భలేవారే , నా మాటలకు అలంకారాలు చేస్తూ అందం చేకూరుస్తున్నారు. ధన్యవాదాలు మీకు.

రసజ్ఞ చెప్పారు...

మరుమల్లెలు తలదాల్చిన
పిల్లది జల్లులనే "విరిజల్లు"లని
"చెఱకువిల్లును బట్టినవాని గురించి వ్రాసిన అల్లిక బాగుంది!మనసుని గిల్లింది!మీ పద నైపుణ్యం తేటతెల్లమగుచున్నది!

మందాకిని చెప్పారు...

రసజ్ఞా, ఎంతో సంతోష పరిచారు నన్ను. మీకు బోల్డన్ని ధన్యవాదాలు.

kallurisailabala చెప్పారు...

జల్లులనే "విరిజల్లు"లని
"చెఱకువిల్లును బట్టినవాని
పూలశరముల"ని
wow...claps...

మందాకిని చెప్పారు...

శైలబాల గారు,
చాలా సంతోషమండీ.

మందాకిని చెప్పారు...

ఈ రోజు నేనెంతో పొంగిపోయానంటే నమ్మండి.